చెప్పిన సమయానికి సినిమా విడుదల చేయడం రాజమౌళికి అలవాటు లేదు. పర్ఫెక్షన్ కోసం పట్టుబట్టే ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఓ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తారు. ఈగ సినిమా అవుట్ ఫుట్ నచ్చక సీజీ వర్క్ మరలా చేయించారు రాజమౌళి. సినిమా కోసం ఎంత రిస్క్ తీసుకోవాడికైనా సిద్దపడే రాజమౌళికి ఆర్ ఆర్ ఆర్ మాత్రం చుక్కలు చూపిస్తుంది. 


ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఏ క్షణాన మొదలుపెట్టారో కానీ సవ్యంగా సాగిన పాపాన పోలేదు. ఆర్ ఆర్ ఆర్ విషయంలో రాజమౌళికి ఎదురైన ఇబ్బందులు, మరో చిత్రానికి ఆయన ఎదుర్కొనలేదు. చరణ్, ఎన్టీఆర్ గాయాలతో మొదలైన షూటింగ్ విరామాల పర్వం అనేక కారణాలతో కొనసాగుతూనే ఉంది. ఇక కరోనా ఎంట్రీ ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి పిడుగుపాటులా మారింది. 2020 జులైకి విడుదల చేయాలనుకున్న ఆర్ ఆర్ ఆర్ జనవరి 2021కి, ఆ తరువాత అక్టోబర్ 2021కి వాయిదా పడింది. 


కరోనా సెకండ్ వేవ్ మరోమారు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ని అడ్డుకోగా విడుదల తేదీ మరలా వెనక్కి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఇంకా కొంత భాగం మిగిలే ఉంది. అలాగే సీజీ వర్క్ పెండింగ్ లో ఉంది. మరో ఆరు నెలల సమయం ఖచ్చితంగా కావాల్సి ఉండగా ఆర్ ఆర్ ఆర్ విడుదల 2022 సమ్మర్ కి వాయిదా వేశారని తెలుస్తుంది. దర్శకుడు రాజమౌళితో పాటు నిర్మాత 2022 సమ్మర్ కానుకగా ఆర్ ఆర్ ఆర్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట.