బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 12వ వారం చాలా రసవత్తరంగా సాగబోతుందని అర్థమవుతుంది. తాజాగా విడుదలైన ప్రోమో అనేక ట్విస్టులతో సాగుతుంది. ఇందులో నాగ్‌ ఇంటి సభ్యులపై ఫైర్‌ అయ్యాడు. అంతేకాదు అభిజిత్‌ని హౌజ్‌ నుంచి పంపించేయబోతున్నాడు. ఇది అందరిని షాక్‌కి గురి చేస్తుంది. మరి ఎప్పటిలాగానే ఇది కూడా బిగ్‌బాస్‌ గేమ్‌లో భాగమేనా, లేక నిజమా అన్నది ఆసక్తి నెలకొంది. 

ఇక ప్రోమోని చూస్తే, హారికని కన్‌ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన నాగ్‌.. `నువ్వు కెప్టెన్‌ అయినప్పుడు ఫర్‌ ది పీపుల్‌, బైది పీపుల్‌, ఆఫ్‌ ది పీపుల్‌ అని చెప్పావు. కానీ కాదు.. నువ్వు కెప్టెన్‌ అయ్యింది మోనాల్‌ కోసం, అభిజిత్‌ కోసం.. అభిజిత్‌ టాస్క్ చేయకపోతే చేయించాల్సిన బాధ్యత ఓ కెప్టెన్‌గా నీదా కాదా..` అని ప్రశ్నించాడు. `పర్సనల్‌గా తీసుకున్నారు సర్‌` అని హారిక అనగా.. ఏంటీ పర్సనల్‌ అని నాగ్‌ ప్రశ్నించాడు. 

ఇక అభిజిత్‌ని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు నాగ్‌. `ఇద్దరు కలిసి మోనాల్‌ని ఏడిపించారనగానే..` అని అభిజిత్‌ అనగానే, `అందులో తప్పేముంది` అని నాగ్‌ అన్నాడు. `నేను ఏడిపించలేదన్నాడు అభిజిత్‌. నాగ్ వీడియో క్లిప్‌ చూపించమనగా.. అందులో మోనాల్‌ని కామెంట్‌ చేసిన క్లిప్‌ ఉంది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు అభిజిత్‌. ఏం చేయలేక నాగ్‌కి సారీ చెప్పాడు. `నువ్వు చెప్పిన మాటలే.. బిగ్‌బాస్‌ టాస్క్ లో పంపించాడ`ని నాగ్‌ అన్నాడు. `ఆ విషయం నేను ఒప్పుకుంటాను సర్.. ఆ విషయంలో తాను రాంగ్‌` అని చెప్పగా, నాగ్‌ స్పందిస్తూ, `అభిజిత్‌ నీకిది మొదటి సారి కాదు. ఎప్పుడూ ఇలానే చేస్తున్నావని, తప్పు చేస్తున్నావ్‌, సారీ చెబుతున్నావ్‌..` అంటూ ఫైర్‌ అయ్యాడు. అంతేకాదు `బిగ్‌బాస్‌ ఓపెన్‌ ది డోర్స్ ` అన్నాడు. దీంతో అభిజిత్‌, ఇంటిసభ్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. మరి ఇంతకి అభిజిత్‌ని ఎలిమినేట్‌ చేస్తున్నారా? ఇది కూడా పెద్ద డ్రామానా? అన్నది ఆసక్తికరంగా మారింది.