తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా కమల్ హాసన్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘విక్రమ్’లో స్పెషల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. రోలెక్స్ పాత్రలో ఇరగదీసిన సూర్య.. మరో స్టార్ హీరోతో బిగ్ స్క్రీన్ పై కనిపించనున్నారు.

సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో తమిళ స్టార్ సూర్య (Suriya) ఒకరు. సూర్యకు తమిళ్ తో పాటు.. తెలుగు ఆడియెన్స్ నూ హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులూ ఉన్నారు. సౌత్ లో స్టార్ హీరోగా, మంచి మార్కెట్ ను కలిగిన సూర్య విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘విక్రమ్’ చిత్రంలో సూరియా స్పెషల్ రోల్ లో నటించారు. ఆయన వచ్చిన రెండు, మూడు నిమిషాలైనా థియేటర్ దద్దరిల్లిపోతుండటం విషేషం. ఇప్పటికే విక్రమ్ సినిమాలో ‘రోలెక్స్’ పాత్రకు భారీ క్రేజ్ ఏర్పడింది. 

ఇదిలా ఉంటే సూర్య గతంలో ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీం’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఇందులో ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ లో అక్షయ్ కుమార్, రాధిక మదన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమిళ దర్శకురాలు సుధా కొంగరనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ రీమేక్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది. రీమేక్ లో Suriya కూడా కామియోగా కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజంగా సూర్య కనిపించడమంటే ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇదే నిజమైతే సౌత్ ఆడియెన్స్ కూడా అక్షయ్ కుమార్, సూర్యను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు సిద్ధంగా ఉన్నట్టే.

ఈ రీమేక్‌ను విక్రమ్ మల్హోత్రాకు చెందిన అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు 2D ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నెలకిందనే ఈ మూవీ చిత్రీకరణ ముహూర్తపు షాట్ ను ప్రారంభించారు. ఆ వీడియోను రాధిక మదన్ (Radhika Madan), అక్షయ్ కుమార్ వారి ఇన్ స్టాలో పోస్ట్ చేసి సినిమా ప్రారంభాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. త్వరలో న్యూ షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీ.ఆర్. గోపీనాథ్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.