బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాలకు దూరమవుతున్నారని గత కొంత కాలంగా రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన సినిమాలను గ్యాప్ ఇస్తున్నారేమో అని అంతా అనుకుంటున్న వేళ.. నిజంగానే పూర్తిగా సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టేసే ఆలోచనలో ఉన్నట్లు నార్త్ మీడియాలో టాక్ వస్తోంది. 

వరుస ఫ్లాపులు ఎదురవడంతో షారుక్ సినిమాల బిజినెస్ బాగా తగ్గిపోయింది. అయితే ఇంకా మార్కెట్ లో తన క్రేజ్ దిగజారకముందే ఎండ్ కార్డ్ పెట్టేయాలని ఆలోచిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అదే విధంగా తన వారసుల కెరీర్ పై ద్రుష్టి పెట్టాలనే ఆలోచనతో కూడా షారుక్ నటనకు దూరమవుతున్నట్లు చెబుతున్నారు. 

పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ కి ఇప్పుడు 21 ఏళ్ళు. అతని ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తన వారసుడి కోసం ఒక మంచి సినిమాని సెట్ చేయాలంటే తాను వేరే పనులు పెట్టుకోకూడదని కింగ్ ఖాన్ డిసైడ్ అయినట్లు టాక్. ఆర్యన్ కెరీర్ ని ఒక ట్రాక్ లో పెట్టాలంటే ఎంతో కొంత సమయం పడుతుంది. 

అతని కెరీర్ ని సెట్ చేయాలనీ షారుక్ సినిమాలకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ రూమర్స్ పై షారుక్ ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.