కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ మొదటి సినిమాతో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్యా వర్మ టీజర్ ను ఇటీవల రిలీజ్ చేసి ఆడియెన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల కాకముందే ధృవ్ తండ్రి మాట వినకుండా నడుచుకున్నట్లు టాక్ వచ్చింది. 

ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో ధృవ్ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఎవరికీ చెప్పకుండా నాన్న సినిమా దర్శకుడు ఏఎల్.విజయ్ చెప్పిన కథను ధృవ్ ఒకే చేసి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు వ్యవహరించాడని టాక్ రాగా ఈ విషయంపై విక్రమ్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. 

రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని ధృవ్ ప్రస్తుతం తన ద్రుష్టి మొత్తం మొదటి సినిమా ఆదిత్య వర్మపైనే ఉంచినట్లు చెప్పారు. అదే విధంగా అధికారికంగా తాము చెప్పేంత వరకు ఏ విధమైన రూమర్స్ ని అభిమానులు నమ్మవద్దని మీడియా కూడా ఏదైనా అనుమానం ఉంటే తమని సంప్రదించవచ్చని వివరణ ఇచ్చారు.