దర్శకధీరుడు రాజమౌళి 400కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న RRR ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు ఆ ప్రాజెక్ట్ గురించి రూమర్స్ ఆగేలా లేవు. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లాంటి బాక్స్ ఆఫీస్ హీరోలు సినిమాలు నటిస్తున్నారు అనగానే ఇరు వర్గాల అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. 

గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ ఇండియాలో తెరకెక్కుతోంది అంటే ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్న నటీనటుల పారితోషికం కూడా గట్టిగానే ఉంటుందనే ఆలోచన రాకుండా ఉండదు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరి స్టార్ హీరోలకు కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్. 

అసలైతే రామ్ చరణ్ - తారక్ లు ఒక్కో సినిమాకు 15కోట్ల వరకు తీసుకుంటారని టాక్ ఉంది. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా కాబట్టి నిర్మాత దానయ్య  ఒక్కొక్కరికి 25కోట్ల పారితోషికాన్ని అఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇంత భారీ పెట్టుబడితో నిర్మిస్తోన్న RRR ఏ స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి. ప్రస్తుతం బల్గెరియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది