బన్నీ సినిమా కోసం రూ.కోటి విలువచేసే లైబ్రరీ

big library setting for allu arjun na peru surya naillu india
Highlights

  • ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ అంటున్న అల్లు అర్జున్
  • వక్కంతం దర్శకత్తంలో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య...’
  • కీలక పాత్రల్లో కోలివుడ్ స్టార్స్ శరత్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్

సినిమాల కోసం కోట్లు ఖర్చు పెట్టి భారీ సెట్టింగులు వేస్తుంటారన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం కూడా ఓ భారీ సెట్టింగ్ వేశారట. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘ నాపేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. ఈ సినిమాలో కోలివుడ్ స్టార్స్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ లు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

 

ఈ ‘నాపేరు...’ కోసం ఓ లైబ్రరీ కావాల్సి వచ్చిందట. దీంతో రూ.కోటి ఖర్చు చేసి మరీ లైబ్రరీ సెట్టింగ్ వేశారట. అందులో సినిమాలోని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు టాక్. శరవేగంగా షూటింగ్  పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాని 2018, ఏప్రిల్ 27న విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బన్నీ గెటప్, డైలాగ్ డెలవరీ కొత్తగా ఉంటాయని చెబుతోంది చిత్రబృందం.

 

దువ్వాడ జగన్నాథం సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై  అల్లు అర్జున్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

loader