బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్స్ గా వెళ్లిన కౌశల్, బాబు గోగినేని మధ్య హౌస్ లో ఉన్నంతకాలం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌశల్.. గోగినేనిని విమర్శించడం, గోగినేని.. కౌశల్ పై సెటైర్లు వేయడం జరిగాయి.

ఆ తరువాత గోగినేని ఎలిమినేట్ అవ్వడంతో వీరిమధ్య గొడవలకు ఛాన్స్ రాలేదు. కానీ కౌశల్ బిగ్ బాస్ టైటిల్ గెలిచి ఇంటర్వ్యూలు ఇచ్చిన సమయంలో బాబు గోగినేని టాపిక్ తీసుకొచ్చి ఆయనకు అశోక చక్రంలో ఎన్ని గీతలుఉంటాయో కూడా తెలియదని కామెంట్స్ చేశాడు.

గోగినేని కూడా కౌశల్ ఆర్మీ.. ఫేక్ ఆర్మీ అంటూ విమర్శలు గుప్పించాడు. పలు చర్చా వేదికల్లో ఇద్దరూ పాల్గొని గొడవ గొడవ చేశారు. ఇప్పుడు షో అయిపోయింది. జనం కూడా ఈ ఫీవర్ నుండి బయటకి వచ్చేశారు. ఇలాంటి క్రమంలో మరోసారి వీరిద్దరూ గొడవ పడడం చర్చనీయాంశమైంది. సంక్రాంతి ప్రత్యేకంగా వీరితో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ ఫంక్షన్ లో కూడా కౌశల్, బాబు గోగినేని ఒకరితో ఒకరు మాటల యుద్ధానికి దిగారు. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన క్లిప్పింగ్ లను తెరపై వేసి గుర్తుచేస్తూ మళ్లీ పాత గొడవలని తవ్వితీశారు. పెద్ద పెద్దగా ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నా.. స్టేజ్ మీద ఉన్న నిర్వాహకులు కూడా వారిని ఆపలేదు. వీరిద్దరి తీరు చూస్తుంటే షోలో జరిగిన విషయాలను వ్యక్తిగతంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ గొడవలకు ముగింపు ఎప్పుడు పలుకుతారో చూడాలి!