రియాలిటీ షోలో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. తెలుగులో సీజన్2 మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హౌస్ నుండి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం మరొకరు హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నారు.

ఈ సంగతి పక్కన పెడితే.. మొదటినుండి కూడా నాని ఈసారి ఇంకొంచెం మసాలా అంటూ చెబుతూ వస్తున్నాడు. దానికి తగ్గట్లే హౌస్ లో నిజంగానే రోజురోజుకి మసాలా ఎక్కువవుతుంది. కొత్తగా తేజస్వి, సామ్రాట్ తో సన్నిహితంగా మెలగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హౌస్ లో వీరి మధ్య ఎదో జరుగుతుందనే చర్చలు ఎక్కువయ్యాయి. నిన్నటి షోలో కూడా తేజస్వి.. సామ్రాట్ వేసుకున్న డ్రెస్ ను పొగుడుతూ షర్ట్ ను సరిచేయడంతో కచ్చితంగా ఇద్దరి మధ్య ఏదో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీప్తి సునయన, తనీష్ క్లోజ్ గా ఉండడంతో కౌశల్ కు డౌట్ వచ్చి గీతామాధురితో ఆ విషయాన్ని డిస్కస్ చేశాడు.

దానికి ఆమె సునయన.. తనీష్ ను బ్రదర్ అంటుందని చెప్పడంతో కౌశల్ ఎంజాయ్ చేయనివ్వండి యూత్ కదా అన్నట్లు కామెంట్ చేసి వెళ్ళిపోయాడు. మరి ఈ విషయాలపై నాని వారిని ఏమైనా క్వశ్చన్ చేస్తాడా..? అనేది ఇప్పుడు అందరూ ఎదురుచూస్తోన్న విషయం. గత వారం తన పెర్ఫార్మన్స్ తో షోని రక్తికట్టించిన నాని ఈ వీకెండ్ లో ఏం చేస్తాడో చూడాలి!