టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనే వ్యవహారం ఈ మధ్య కాలంలో పెను దుమారం రేపింది. పలువురు తారలు సైతం ఈ విషయంపై స్పందిస్తూ తము ఎదుర్కొన్న సంఘటనలను వివరించారు. బిగ్ బాస్ బ్యూటీ సంజన కూడా గతంలో ఈ విషయంపై స్పందించింది. రెండేళ్ల క్రితం మిస్ హైదరాబాద్ గా ఎంపికైన సంజనా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

హౌస్ లో ఎంటర్ అయినప్పటి నుండి ఆమె చేస్తోన్న వ్యాఖ్యల కారణంగా ఆమెను ఫైర్ బ్రాండ్ అని పిలుస్తున్నారు. ఈమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కొందరిలో కలుగుతోంది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఈ భామ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్ చేసింది. మోడలింగ్ తరువాత 
సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ డైరెక్టర్ ను కలిసిందట.

అతడి మాటలు తేడాగా అనిపించడంతో జాగ్రత్త పడిందట. ఇండస్ట్రీ గురించి తెలుసు కదా అంటూ ఆమెతో అనుచితంగా మాట్లాడినట్లు తెలిపింది. ఓ రోజు మ్యానేజర్ ద్వారా ఆఫీస్ కు రమ్మని కబురు పెట్టాడట. దీంతో తన అన్నయ్య, అక్కను వెంట పెట్టుకొని వెళ్లడంతో సదరు డైరెక్టర్ కి చాలా కోపం వచ్చి ఆమెపై సీరియస్ అయ్యాడట. తనకు కమిట్మెంట్ ఇస్తే.. ముంబైలో ఫ్లాట్, డబ్బు, సినిమా ఆఫర్లు ఇప్పిస్తానని ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయగా.. అతడి చెంప మీద గట్టిగా కొట్టినట్లు చెప్పుకొచ్చింది సంజనా.