నిజమే..స్టార్ మా యాజమాన్యం ఇప్పుడు ఎన్టీఆర్ ని తమ బిగ్ బాస్ 3 షోలోకి తీసుకురావాలని తెగ ట్రై చేస్తున్నారని టాక్. ఈ మేరకు ఎన్టీఆర్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  అయితే ఎన్టీఆర్ ఇఫ్పుడు ఆర్ ఆర్ ఆర్ బిజీలో ఉన్నారు. రాజమౌళి ఫర్మిషన్ ఇచ్చేలా లేరు. టీవికు డేట్స్ ని ఎన్టీఆర్ కేటాయిస్తే తమ సినిమాకు ఇబ్బంది అవుతుందని ఓకే చేయకపోవచ్చు అంటున్నారు.  అయితే ఆడియన్స్ తో ఈ షో ద్వారా కనెక్ట్ అవుతారు కాబట్టి ఎన్టీఆర్ నో చెప్పకపోవచ్చనేది టీవి ఛానెల్ టీమ్ ఆశ.  

వాస్తవానికి యంగ్ టైగర్   బుల్లి తెరపై  బిగ్ బాస్ తో అదరకొట్టాడనే చెప్పాలి. దాంతో ఆ ఎనర్జీతో మ్యాచ్ అయ్యే వేరే యాంకర్ దొరకటం లేదు.  రెండవ సీజన్ ను తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు నానితో చేసారు కానీ..అంతగా క్లిక్ అవ్వలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్థాయిలో నాని మెప్పించలేక పోయాడంటూ పోలిక వచ్చేసింది. సోషల్ మీడియాలో సైతం ఈ షోపై ఓ రేంజిలో సెటైర్స్ పడ్డాయి.అయితే ఓవరాల్ గా బిగ్ బాస్ 2 కూడా సక్సెస్ అయ్యింది. దా్ంతో ఇప్పుడు మూడవ సీజన్ కు సంబంధించిన డిస్కషన్స్  మొదలయ్యాయి. మూడవ సీజన్ కు ఎన్టీఆర్ ఒప్పుకోకపోతే హోస్ట్ ఎవరనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

 రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్  ఎక్కువగా హైదరాబాద్ లోనే  జరిగే అవకాశం ఉంది. అందుకే ఎన్టీఆర్ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించేందుకు ఇబ్బంది ఉండదనేది టీవీ ఛానెల్ వారి వాదన. ఈ నేపధ్యంలో ఇదే కారణంతో ఎన్టీఆర్ ని ఒప్పిస్తామనే నమ్మకంతో ఉన్నట్లు సమాచారం.  గతంలో కూడా మరో సీజన్ చేస్తానని ఛానెల్ యాజమాన్యంతో ఎన్టీఆర్ అన్నారట. అందుకే ఈ ట్రైల్స్ అంటున్నారు. 

అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి గ్రీన్ సిగ్నల్ కానీ నో చెప్పటం కానీ చెయ్యలేదు . కానీ రాజమౌళి టీమ్ వారు మాత్రం ఈ షోకు ఎన్టీఆర్ చేస్తే ...తమ మల్టీస్టారర్ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ బయిటకు వచ్చేస్తుంది కాబట్టి చేసే అవకాసం ఉండదని అంటున్నారు.   ఇలా ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నారు.