స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కు 24 గంటలు నాన్‏స్టాప్ ఎంటర్‏టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.. రియాల్టీ షో బిగ్‏బాస్. కేవలం ఒక గంటో.. రెండు గంటలో  కాకుండా ఈసారి ఏకంగా 24 గంటలు వినోదాన్ని పంచబోతోంది.

స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కు 24 గంటలు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.. రియాల్టీ షో బిగ్బాస్. కేవలం ఒక గంటో.. రెండు గంటలో కాకుండా ఈసారి ఏకంగా 24 గంటలు వినోదాన్ని పంచబోతోంది.

దాదాపు ఐదేళ్లుగా.. 5 సీజన్లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది బిగ్ బాస్ రియాల్టీ షో. అయితే 24 గంటలు హౌస్ లో జరిగే విషయాలను ఒక గంట మాత్రమే ప్రసారం చేయడంతో.. చాలా ఫన్ ను ఆడియన్స్ మిస్ అవుతున్నారు అన్న ఉద్ధేశ్యంతో... 24 గంటలు హౌస్ లో ఏం జరుగుతుందో చూస్తూ.. ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు బిగ్ బాస్ టీమ్. ఆడియన్స్ కు బిగ్ బాస్ ను చేరువచేసేందుకు బిగ్బాస్ ఓటీటీ అంటూ సరికొత్త ప్రయత్నం చేస్తుంది.

ఇక ఈరోజు( ఫిబ్రవరి 26) సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో గ్రాండ్ గా లాంచ్ కానుంది.ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లోఈ రోజు నుంచి రియాల్టీ షో నాన్ స్టాప్ గా ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన లోగో.. ప్రోమో విడుదల చేసి ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్. ఇక గత 3 సీజన్లకు యాంకర్ గా అదరగొట్టిన టాలీవుడ్ కింగ్ నాగార్జునానే బిగ్ బాస్ ఓటీటీకి కూడా హోస్టింగ్ చేయబోతున్నాడు.

Scroll to load tweet…

 అయితే ఈ బిగ్బాస్ ఓటీటీ వస్తోంది అన్నప్పటి నుంచి కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంపై బయట తెగ చర్చ నడుస్తోంది. ఇందులో ఫ్రెష్ కంటెస్టెంట్స్ తో పాటు మాజీ కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.అయితే గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్బాస్ ఓటీటీలో మాజీ కంటెస్టెంట్స్తోపాటు.. సోషల్ మీడియా, యూట్యూబ్ నుంచి కూడా కొత్తవారు రాబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో బిగ్బాస్ ఓటీటీలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ప్రచారం నడుస్తోంది. అందులో మాజీ కంటెస్టెంట్స్గా అందులో ముమైత్ ఖాన్.. తనీష్, అషు రెడ్డి, అరియానా, అఖిల్ సార్థక్, మహేష్ విట్టా, సరయూ, హమీదా,నటరాజ్ మాస్టర్ రోహిణి, రోల్ రైడా ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి వీరితో పాటు మరికొంత మంది మాజీ కంటెస్టెంట్స్ కూడా ఓటీటీ బిగ్ బాస్ లో పాల్గోనబోతుననట్టు తెలుస్తోంది.

Scroll to load tweet…

ఇక బిగ్ బాస్ ఓటీటీ లో పాల్గొనబోయే కొత్తవారిలో యూట్యూబర్ యాంకర్ నిఖిల్, యాంకర్ స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, బిందు మాధవి, యాంకర్ శివ, బమ్ చిక్ బబ్లూ, కప్పు ముఖ్యం బిగులూ వెంకట్, మిత్రా శర్మ, శ్రీరాపాక తో పాటు మరికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. దాదాపు 84 రోజులు.. అంటే 12 వారాలు ఓటీటీ బిగ్ బాస్ జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

Scroll to load tweet…

అంతే కాదు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి మరిన్ని రోజులు పెంచుకునేందుకు ఆలోచిస్తున్నారట బిగ్ బాస్ టీమ్. ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేందుకు ఇఫ్పటికే ప్రోమోలు. ప్రమోషన్లతో సోషల్ మీడియాలో డిస్నీప్లస్ హాట్ స్టార్ హడావిడి చేస్తూనే ఉంది. మరి ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో నాన్ స్టాప్.. ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.