తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం హైయెస్ట్ టీఆర్పీ దక్కించుకుంటుంది. ఏళ్లుగా సాగుతున్న ఈ సీరియల్ ని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో కంటే కూడా కార్తీక దీపం అత్యధిక టీఆర్పీ దక్కించుకోవడం విశేషం. కార్తీక దీపంలో ప్రధాన పాత్రలైన దీప, కార్తీక్ లకు ప్రేక్షకులలో యమా క్రేజ్ ఉంది. 

ఈ క్రేజ్ ని స్టార్ మా దసరా పండుగ సంధర్భంగా క్యాష్ చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాతరో జాతర పేరుతో ప్రముఖ యాంకర్స్ తో పాటు బుల్లితెర నటులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దీప, కార్తీక్ ల ఎపిసోడ్ ఆసక్తికరం కానుంది. ఈ ఎపిసోడ్ లో గంగవ్వ భాగంకావడంతో మరింత హైప్ వచ్చి చేరింది. 

వంటలక్క, డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారని అందరూ ఎదురు చూస్తున్నారని యాంకర్ రవి అనగా...గంగవ్వ నేను కూడా రోజూ చూస్తున్నా వీరిద్దరూ ఎప్పుడు కలుస్తారని చెప్పింది. కార్తీక్, దీపల చేతలు కలిపి వారిద్దరిని ఒక్కటి చేసే ప్రయత్నం గంగవ్వ చేసింది. ప్రత్యేక కార్యక్రమంలో గంగవ్వ కార్తీక్, దీపల డ్రామా ఎపిసోడ్ ఆసక్తికరంగా నడిచింది. కార్యక్రమంలో వాళ్లంతా ఈ సీన్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు.