ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదు. బిగ్ బాస్ ఇంటి సభ్యులు, వారానికి ఒకసారి వచ్చి పలకరించే హోస్ట్ తో తప్ప మరెవరితో ఎటువంటి కమ్యూనికేషన్ ఉండడానికి వీలు లేదు. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగినా బిగ్ బాస్ నిర్వాహకులు తెలియపరచరని తాజా ఉదంతం ద్వారా తెలుస్తుంది. 

బిగ్ బాస్ హౌస్ లో ఉండగా దివి తాతగారు మరణించారట. ఆ విషయం బిగ్ బాస్ నిర్వాహకులు దివికి తెలియపరచలేదు. గత వారం ఎలిమినేటై ఇంటికి వెళ్లిన దివి అమ్మమ్మను చూసి తాతయ్య ఎక్కడని అడుగగా ఆమె గట్టిగా ఏడ్చేశారట. తాతయ్య చనిపోయారని తెలుసుకున్న దివి షాక్ కి గురయ్యారట. మొదటివారం ఎలిమినేషన్ సమయంలో ఇది జరిగిందని దివి చెప్పుకొచ్చారు. 

అలాగే తాతయ్యతో ఆమెకు గల అనుబంధాన్ని దివి గుర్తు చేసుకున్నారు. హీరోయిన్ అవుతా అంటే ఇంట్లో వాళ్ళు ససేమిరా అన్నారట. తాతయ్య మాత్రమే ప్రోత్సహించి పరిశ్రమకు రావడానికి కారణం అయ్యారట. అందగాడైన దివి తాతయ్యకు అప్పట్లో జగ్గయ్యతో పాటు నటించే అవకాశం ఉందని లెటర్ వచ్చిందట.  ఆ విషయం దివి తాతయ్య వాళ్ళ నాన్నతో చెవితో ఆయన కోప్పడ్డారట. నటిగా నేను సక్సెస్ కావాలని కోరుకున్న,  తాతయ్యను చివరి చూపు కూడా చూసుకోలేక పోయానని దివి బాధపడ్డారు.