Asianet News TeluguAsianet News Telugu

షాక్: సూసైడ్ చేసుకున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్

 ‘ఉప్పు హులి కారా’, ‘కన్నడ గొత్తిల్లా’ వంటి చిత్రాల్లో నటించిన జయశ్రీ.. క‌న్న‌డ‌లో రియాలిటీ షో బిగ్‌బాస్ 3లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ క్ర‌మంలో ఎంతో మంది అభిమానుల‌ను కూడా సంపాదించుకున్నారు. అయితే బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఆమెకు పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదు. ఈ క్ర‌మంలో డిప్రెష‌న్‌లోకి వెళ్లింది.

Big boss contestant jayashree ramaiah commits suicide jsp
Author
Hyderabad, First Published Jan 25, 2021, 4:08 PM IST

ఈ సంవత్సరం ప్రారంభమే మరో విషాదాన్ని అందించింది. క‌న్న‌డ‌ న‌టి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ జ‌య‌శ్రీ రామ‌య్య సూసైడ్ చేసుకున్నారు. బెంగ‌ళూరులోని త‌న ఇంట్లో ఉరేసుకొని ఆమె బ‌ల‌వ‌న్మ‌ర‌ణంకు పాల్ప‌డ్డారు. అయితే గ‌త కొన్ని రోజులుగా డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న ఆమె.. బెంగ‌ళూరులోని సంధ్య కిర‌ణ ఆశ్ర‌మంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో డిప్రెష‌న్‌ను భ‌రించ‌లేక‌నే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ప్రాధమిక స‌మాచారం. 
 
 ఈ ఉద‌యం నుంచి జ‌య‌కు కుటుంబ స‌భ్యులు, స్నేహితులు ఫోన్లు చేస్తుండగా ఎత్త‌క‌పోవ‌డంతో.. వారు ఆశ్ర‌మ్‌కి ఫోన్లు చేశారు. దీంతో ఆశ్ర‌మ్ నిర్వాహ‌కులు ఆమె ఇంటికి వెళ్లగా.. అప్ప‌టికే జ‌య‌శ్రీ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీంతో వారు కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. ఇక దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తును ప్రారంభించారు.

 ‘ఉప్పు హులి కారా’, ‘కన్నడ గొత్తిల్లా’ వంటి చిత్రాల్లో నటించిన జయశ్రీ.. క‌న్న‌డ‌లో రియాలిటీ షో బిగ్‌బాస్ 3లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ క్ర‌మంలో ఎంతో మంది అభిమానుల‌ను కూడా సంపాదించుకున్నారు. అయితే బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఆమెకు పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదు. ఈ క్ర‌మంలో డిప్రెష‌న్‌లోకి వెళ్లింది.

ఇక గతేడాది జూలై 22న ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా అభిమానులకు వెల్లడించింది. దీంతో అభిమానులు ఆందోళన చెందగా వెంటనే ఆమె సదరు పోస్టును తొలగించింది. బాగానే ఉన్నానని, కంగారు పడాల్సిన పని లేదని తన మానసిక స్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో హీరో కిచ్చా సుదీప్‌ ఆమెకు ధైర్యం చెప్పినట్లు కూడా వార్తలు వినిపించాయి. 

కానీ మళ్లీ ఐదు రోజులకే అంటే జూలై 25న అభిమానులతో లైవ్‌లో ముచ్చటించిన జయశ్రీ తన మనసులో ఉన్న బాధనంతా చెప్పుకొచ్చారు. "నేనిదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదు. సుదీప్‌ సర్‌ నుంచి ఆర్థిక సాయం కోరట్లేదు. నా చావును మాత్రమే కోరుకుంటున్నాను. డిపప్రెషన్‌తో పోరాడలేకపోతున్నా. ఆర్థికంగా నేను బాగానే ఉన్నాను కానీ మానసిక ఒత్తిడితోనే చచ్చిపోతున్నా. ఎన్నో వ్యక్తిగత సమస్యలు నన్ను చీల్చి చెండాడుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఈ సమస్యల ఊబిలో చిక్కుకున్న నేను వాటిని అధిగమించలేకపోతున్నాను" అని పేర్కొంది. 

ఈ మధ్య కాలంలో కూడా ఆమె తన మానసిక పరిస్థితి గురించి చెప్తూ ఓడిపోయానని, చనిపోవాలని ఉందని పేర్కొంది. దీర్ఘకాలంగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైన జయశ్రీ చివరికి అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆమె కిచ్చా సుదీప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కన్నడ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొంది.

Follow Us:
Download App:
  • android
  • ios