తెలుగు బిగ్ బాస్ హోస్టింగ్ పై ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చేసింది. నాగార్జున మూడవ సీజన్ ని హోస్ట్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా హోస్టింగ్ పై అనేక రకాల రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. 

మెగాస్టార్ నుంచి వెంకటేష్ - రానా వరకు.. ఇలా చాలా మంది స్టార్స్ పేర్లు వినిపించాయి. ఆఖరికి విజయ్ దేవరకొండ కూడా షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.; అయితే ఫైనల్ షో నిర్వాహకులు హోస్టింగ్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. 

అక్కినేని నాగార్జున జులై నెలలో స్టార్ట్ కాబోయే బిగ్ బాస్ 3 సీజన్ కి వ్యాఖ్యాతగా సంతకం చేసినట్లు సమాచారం. ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరికొన్న్ని రోజుల్లో షో నిర్వాహకులు నాగార్జునను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.