బిగ్‌బాస్ సీజన్2: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరో తెలుస్తే షాక్..!

Big Boss 2: Wild card entry
Highlights

తెలుగులో అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌‌బాస్. ప్రస్తుతం జరుగుతున్న ఈ రెండవ సీజన్ ప్రారంభమై అప్పుడే  ఒక వారం గడిచిపోయింది. 

తెలుగులో అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌‌బాస్. ప్రస్తుతం జరుగుతున్న ఈ రెండవ సీజన్ ప్రారంభమై అప్పుడే  ఒక వారం గడిచిపోయింది. మొదటివారం ఎలిమినేషన్ రౌండ్‌లో సామాన్యుల విభాగం (కామనర్)లో వచ్చిన మోడల్ సంజనా ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే, వంద రోజుల పాటు జరిగాల్సిన ఈ షోలో ఇలా ప్రతివారం ఎవరో ఒకరు ఎలిమేట్ అవుతూ పోతే, షోలో కిక్ ఏముంటుంది చెప్పండి. అందుకే, ఈసారి గడచిన సీజన్ కన్నా ముందుగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశపెట్టేస్తున్నారు. మరి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తున్న సెలబ్రిటీ ఎవరో తెలుసా, ఆమేనండి మన నందిని రాయ్.

సుధీర్ బాబు నటించిన సినిమా "మోసగాళ్లకు మోసగాడు" చిత్రంలో హీరోయిన్‌గా చేసిన హైదరాబాద్ మోడల్ నందిని రాయ్ బిగ్ బాస్2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రాబోతోందని సమాచారం. మరి ఈమె ఎంట్రీలో హౌస్‌లో ఎలాంటి సందడి నెలకొనబోతుందో తెలియాలంటే బిగ్‌బాస్ సీజన్ 2 చూడాల్సిందే.

loader