Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ మెట్రోలో అమితాబచ్చన్, ఇక్కడేం చేస్తున్నారంటే.. ?

అప్పుడప్పుడు సెలబ్రిటీలు సామాన్యుల మాదిరి బయట సందడి చేస్తుంటారు. అటువంటి సందర్భాలు చాలా జరిగాయి. షూటింగ్ సందర్భంగా కూడా పెద్ద పెద్ద స్టార్స్ సామాన్యులతోకలిసి పోయిన సందర్భాలు ఉన్నాయిఇక రీసెంట్ గా బాలీవుడ్ బిగ్ బీ అమితావ్ కూడా ఇలానే ప్రత్యక్షం అయ్యారు.
 

Big B Amitabh Bachchan At Hyderabad Metro
Author
Hyderabad, First Published Jun 30, 2022, 3:40 PM IST

అప్పుడప్పుడు సెలబ్రిటీలు సామాన్యుల మాదిరి బయట సందడి చేస్తుంటారు. అటువంటి సందర్భాలు చాలా జరిగాయి. షూటింగ్ సందర్భంగా కూడా పెద్ద పెద్ద స్టార్స్ సామాన్యులతోకలిసి పోయిన సందర్భాలు ఉన్నాయిఇక రీసెంట్ గా బాలీవుడ్ బిగ్ బీ అమితావ్ కూడా ఇలానే ప్రత్యక్షం అయ్యారు.

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సడెన్ గా  సాధారణ ప్రయాణికుడిలా మారిపోయారు.  అది కూడా హైదరాబాద్ లో మెట్రో  మెట్రో స్టేషన్ లో కనిపించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం అమితాబ్ బచ్చన్  కనిపించారు. ఆయనతో పాటు మూవీ టీమ్ కూడా పక్కనే ఉన్నారు. ఈ స్టేషన్ లో మూవీ షూటింగ్ జరుగుతుండటంతో... అక్కడ బిగ్ బీను చూసిన ప్రయాణికులు తమ ఫోన్లకు కుపని చెప్పారు. వరుసగా ఫోటోలు క్లిక్క్ మనిపించారు. 

నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈమూవీని పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు.అంతే కాదు పూర్తిగా భిన్నంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో ఫస్ట్ పాన్ఇండియాకు నాగ్ అశ్వీన్ వెళ్లబోతున్నాడు. సినిమా కథకు సబంధిచి చాలా స్టోరీస్ ప్రచారంలో ఉన్నాయి. త్వరలో ఈసినిమాకు సబంధించి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ప్రాజెక్టు కె సినిమాలో నటిస్తున్నారు .ఈ సినిమా షూటింగ్ కొంత కాలంగా హైదరాబాద్ పరిసరాల్లోనే జరుగుతోంది. ఈ సినిమాలో హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ గా బాలీవుడ్ సీనియర్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకుని దీపికా.. రీసెంట్ గా ముంబయ్ వెళ్ళి పోయింది. ఇక బిగ్ బీకి సంబంధించిన సీన్లను షూట్ చస్తున్నారు. ఇక  ఓ మెట్రో యూజర్ రెడిట్ నెట్ వర్క్ లో అమితాబ్ షూటింగ్ గురించి పోస్ట్ పెట్టాడు.


అమితాబ్ షూటింగ్ కోసం వచ్చి ఉండొచ్చు. ఓ బ్లూ లైన్ ట్రెయిన్ లోకి ఎవరినీ అనుమతించలేదు. నేను అమీర్ పేట స్టేషన్లో సాయంత్రం 6 గంటలకు వేచి ఉన్నాను. మెట్రో ఒక డమ్మీ రైలును రద్దీ వేళల్లో ఎందుకు నడిపిస్తోందో నాకు అప్పుడు అర్థం కాలేదు. రైలులో అమితాబ్ కనిపించలేదు కానీ, మెడలో ఐడీ కార్డులు వేసుకున్న కెమెరామ్యాన్ లు కనిపించారు అని పేర్కొన్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios