ఆ విషయంలో చిరుతో వివాదం.. క్లారిటీ ఇచ్చిన ‘భోళా శంకర్’ నిర్మాత
‘భోళా శంకర్’ మూవీ రిలీజ్ తర్వాత మెగా స్టార్ చిరంజీవిపై చాలా విమర్శలు, నమ్మశక్యం కాని ఆరోపణలు వినిపించాయి. దానిపై తాజాగా నిర్మాతనే స్పందించారు. ఒక్క ట్వీట్ తో సమాధానం ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లేటెస్ట్ గా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. తమన్నా భాటియా కథానాయిక. కీర్తి సురేష్, అక్కినేని సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్స్ మెంట్ బ్యానర్ పై నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. తన తండ్రి రాంబ్రాహ్మం సుంకర పేరుతో చిత్రాన్ని తెరకెక్కించారు. చాలా గ్రాండ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న రిలీజ్ చేశారు.
అయితే, మొదటిరోజే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి కాస్తా నెగెటివ్ టాక్ అందింది. దీంతో సినిమా కలెక్లన్ల పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ క్రమంలోనే చిరుపై కొన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. సినిమా రిలీజ్ కు ముందే చిరు- నిర్మాత అనిల్ సుంకర మధ్య విబేధాలు వచ్చాయని వార్తలు కూడా వచ్చాయి. మెగాస్టార్ అనిల్ ను రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బందిపెట్టారని, తనకివ్వాల్సిన 65కోట్లు ఇవ్వాలని మొండికేసినట్టు కొందరు ప్రచారం చేశారు.
అదే సమయంలో అందులో ఎలాంటి నిజం లేదని మెగా అభిమానులు, తదితరులు కొట్టిపారేశారు. అయినా రూమర్లు ఆగడం లేదు. దీంతో స్వయంగా నిర్మాతనే తన బ్యానర్ ‘ఏకే ఎంటర్ టైన్ మెంట్స్’పై ప్రకటన చేశారు. ‘ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న వివాదాలకు సంబంధించిన పుకార్లు పూర్తిగా ఆధారం లేనివి. బేస్‌లెస్ అండ్ సెన్స్‌లెస్. వాటిలో ఒక్క శాతం కూడా నిజం లేదు. మేము ప్రతి ఒక్కరినీ దయతో కోరుతున్నది ఏంటంటే.. అలాంటి వార్తలను నమ్మి అనవసర చర్చలు జరపొద్దని ఆశిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. దీంతో ఆ రూమర్లకు అడ్టుకట్ట పడింది. ఇక లీకైన వాట్సాప్ చాట్ లోనూ చిరంజీవితో మరో సినిమా చేయబోతున్నాం.. ఆయన చాలా హ్యూమానిటీ కలిగిన వారు అని కూడా బదులిచ్చారు. తాజాగా మరోసారి ఇలా స్పందించారు.
ఇక చిరంజీవిపై కొందరు కావాలనే ఇలాంటి ప్రచారానికి తెరలేపారని అర్థం అవుతోంది. మెగాస్టార్ పై మరీ ఇంతలా దిగజారి విమర్శలు గుప్పించడం అభిమానులను బాధించింది. ఆయన గొప్పతనమేంటో ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులైన యంగ్ డైరెక్టర్స్ నోట విన్నాక కూడా ఇలాంటి ప్రచారానికి పూనుకోవడం గమనార్హం. ఇక భోళా శంకర్ మూడు రోజుల్లో రూ.26 కోట్లకు పైగానే వసూల్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.