ప్రభాస్.. అనుష్కను పెళ్లి చేసుకోడా?

Bhimavaram Girl For Prabhas
Highlights

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ టాలీవుడ్ అనగానే గుర్తొచ్చే పేరు ప్రభాస్. 'బాహుబలి' చిత్రంతో 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ టాలీవుడ్ అనగానే గుర్తొచ్చే పేరు ప్రభాస్. 'బాహుబలి' చిత్రంతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయంలో మొదటగా వినిపించేది అనుష్క పేరు. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని పలు సందర్భాల్లో ప్రభాస్, అనుష్క చెప్పినప్పటికీ ఈ రూమర్లకు మాత్రం చెక్ పెట్టలేకపోయారు.

ఈ ఏడాదిలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని కృష్ణంరాజు చెప్పడం, అనుష్కకు కూడా ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తామని ఆమె తల్లితండ్రులు నిర్ణయించడంతో మళ్లీ వార్తలు గుప్పుమన్నాయి. బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా వీరిద్దరికీ ఈ ఏడాదిలోనే పెళ్లి జరగబోతుందంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. కానీ ఈ వార్తల్లో నిజం లేదని తేలింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ తల్లి, పెదనాన్న కృష్ణంరాజు ఇప్పటికే ఒక అమ్మాయిని తమ ఇంటి కోడలిగా చేసుకోవాలని భావిస్తున్నారట. భీమవరంలో విద్యాసంస్థలు నడుపుతోన్న ఓ ప్రముఖ వ్యక్తి కుమార్తెను ప్రభాస్ కోసం అడుగుతున్నారు. రెండు కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంబంధం గనుక ఫిక్స్ అయితే అధికారికంగా  ప్రకటన చేయాలనుకుంటున్నారు. అనుష్క, ప్రభాస్ మంచి స్నేహితులు మాత్రమేనని వారిపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. 

loader