పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. అమలాపురం నుంచి అమెరికా వరకు పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ జపం చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. 

దీనితో భీమ్లా నాయక్ మ్యానియా పీక్స్ కి చేరుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పొలిటికల్ గా ఎలా ఉన్నా.. కేటీఆర్, పవన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనుండడం ఆసక్తిగా మారింది. 

ఆల్రెడీ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వద్ద పవన్ అభిమానులు జనసంద్రాన్ని తలపిస్తున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు వారు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం లక్షలాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

పవన్ ప్రసంగంతో ఏపీ పాలిటిక్స్ లో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. దీనితో పవన్ ఏం మాట్లాడబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. అలాగే భీమ్లా నాయక్ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.