2022 సంక్రాంతి రేసు నుండి భీమ్లా నాయక్ (Bheemla Nayak)తప్పుకుంది. ఫిబ్రవరి 25న మహా శివరాత్రి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా జరిగిపోయింది. ఈ పరిణామం పరిశ్రమలో ఇబ్బందికర వాతావరణానికి కారణమైంది.
నెల రోజులకు పైగా భీమ్లా నాయక్ విడుదలపై సందిగ్ధత కొనసాగుతుంది. ఆర్ఆర్ఆర్ (RRR movie)మేకర్స్ భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేయాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆర్ఆర్ఆర్ జనవరి 7న విడుదల అవుతుండగా, భీమ్లా నాయక్ విడుదల కేవలం ఐదు రోజుల వ్యవధిలో 12న విడుదల కానుంది. వసూళ్ల పరంగా రెండు చిత్రాలకు దెబ్బే. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి మరింత నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది.
భీమ్లా నాయక్ విడుదల కారణంగా ఆర్ఆర్ఆర్ భారీగా థియేటర్స్ కోల్పోవాల్సి వస్తుంది. భీమ్లా నాయక్ సంక్రాంతి విడుదల ఆపడం కోసం రాజమౌళి చేయని ప్రయత్నం లేదు. అయితే భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ససేమిరా అన్నారు. సంక్రాంతి రేసు నుండి భీమ్లా నాయక్ తప్పుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు. పరోక్షంగా ఆర్ఆర్ఆర్ టీమ్ కి తన ట్వీట్స్ ద్వారా సందేశం పంపుతూ వచ్చారు.
నిర్మాతే అంత ధృడమైన హామీ ఇస్తున్నప్పుడు ఇక భీమ్లా నాయక్ జనవరికి రావడం ఖాయమే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. భీమ్లా నాయక్ విడుదల వాయిదా అసలు ఇష్టం లేని ఫ్యాన్స్ లో నాగ వంశీ ట్వీట్స్ జోష్ నింపాయి. అయితే అనూహ్యంగా పవన్ ఫ్యాన్స్ కి షాక్ తగిలింది. భీమ్లా నాయక్ విడుదల వాయిదాపై అధికారిక ప్రకటన జరిగింది. సంక్రాంతి రేసు నుంచి శివరాత్రికి షిఫ్ట్ అయ్యింది.
దర్శకుడు రాజమౌళి(Rajamouli), దిల్ రాజు తమ ప్రాబల్యం మొత్తం ఉపయోగించి భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేయించగలిగారు. ఈ పరిణామం పరిశ్రమలో కొందరి అసహనానికి కారణమైంది. ఆర్ఆర్ఆర్, బీమ్లా నాయక్ చిత్రాల యూనిట్స్ మధ్య మనస్పర్ధలకు దారితీసింది. నిర్మాత నాగ వంశీ .... 'ఈ విషయం నా చేయి దాటిపోయింది, భీమ్లా నాయక్ వాయిదా పవన్ కళ్యాణ్ నిర్ణయమే' అంటూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆయన ఆ విధంగా సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మరోవైపు రాజమౌళి ట్వీట్ సైతం ఆయన అసహనం బయటపెట్టేలా ఉంది. సర్కారు వారి పాట ఫర్ఫెక్ట్ సంక్రాంతి చిత్రం, పరిస్థితులను అర్థం చేసుకొని మహేష్ తన సినిమా సమ్మర్ కి వాయిదా వేసుకున్నాడని.. సర్కారు వారి టీమ్ ని ప్రశంసించారు. సర్కారు వారి పాట టీమ్ ని పొగడం ద్వారా రాజమౌళి భీమ్లా నాయక్ టీమ్ పై తన అసహనం ప్రదర్శించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
ఎందుకంటే భీమ్లా నాయక్ మూవీ సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నప్పటికీ... దీని కోసం రాజమౌళి తీవ్ర ప్రయత్నం చేయాల్సి వచ్చింది. నేరుగా పవన్ (Pawan Kalyan)ని కలిసి రిక్వెస్ట్ చేసినా హామీ దక్కలేదు. దిల్ రాజుతో పాటు మరికొందరు రంగంలోకి దిగి, భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేయించారు.
మరోవైపు భీమ్లా నాయక్ మూవీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఈ పరిమాణం మింగుడుపడటం లేదట. ముందుగా సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకున్న భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేయడమేమిటని ఆయన రాజమౌళితో పాటు దీనికి కారణమైన వారిపై కోపంగా ఉన్నారట. మొత్తంగా రాజమౌళి, దిల్ రాజు ఒకవైపు, నాగ వంశీ, త్రివిక్రమ్, పవన్ మరోవైపు అన్నట్లు నడిచిన భీమ్లా నాయక్ విడుదల వాయిదా వ్యవహారం పెద్దల మధ్య మస్పర్ధలకు దారితీసిందని సమాచారం.
Also read మీ వెనుక వెంకన్న దేవుడుంటే.. నా వెనుక సుకుమార్ ఉన్నాడు
