పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్. బుల్లితెరపై అభిమాన హీరో జాతర కోసం ఎదురుచూస్తున్న వారి కల ఓ రోజు ముందే తీరనుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భీమ్లా నాయక్ విడుదల ముహూర్తం మార్చింది.
పవన్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్(Bheemla Nayak). సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ రూ. 100 కోట్ల షేర్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మాస్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. పవన్ కి పోటాపోటీగా రానా నటన విమర్శకుల ప్రశంశలు దక్కించుకుంది. డానియల్ శేఖర్ గా రానా సిల్వర్ స్క్రీన్ పై దుమ్మురేపాడు. ఇటీవలే భీమ్లా నాయక్ రన్ థియేటర్స్ లో ముగిసింది.
ఇక భీమ్లా నాయక్ ఓటీటీ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Bheemla Nayak on hotstar) దక్కించుకున్న విషయం తెలిసిందే. మార్చి 25 నుండి భీమ్లా నాయక్ స్ట్రీమ్ కానుంది. అయితే ఈ డేట్ ని చేంజ్ చేశారు. ఒకరోజు ముందే అనగా మార్చి 24 నుండి భీమ్లా నాయక్ స్ట్రీమ్ కానున్నట్లు హోస్ట్ స్టార్ యాజమాన్యం అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఫ్యాన్స్ కి భీమ్లా నాయక్ జాతర జరగనుంది.
కాగా మరో ఓటీటీ యాప్ ఆహా లో కూడా భీమ్లా నాయక్ స్ట్రీమ్ కానుంది. హాట్ స్టార్ తో పాటు ఆహా ప్రేక్షకులకు కూడా భీమ్లా నాయక్ మార్చి 24న అందుబాటులోకి రానుంది. ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. భీమ్లా నాయక్ మూవీ మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ కి తెలుగు రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
