పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. అమలాపురం నుంచి అమెరికా వరకు పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ జపం చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. 

దీనితో భీమ్లా నాయక్ మ్యానియా పీక్స్ కి చేరుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పొలిటికల్ గా ఎలా ఉన్నా.. కేటీఆర్, పవన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనుండడం ఆసక్తిగా మారింది. 

ఇదిలా ఉండగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొత్త ట్రైలర్ లాంచ్ చేశారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ పై అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనితో ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి కేటీఆర్ చేత కొత్త ట్రైలర్ లాంచ్ చేయించారు. 

ఈ ట్రైలర్ పవన్ అభిమానులు కోరుకునే విధంగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కళ్ళు చెదిరే యాక్షన్ సీన్స్ తో పాటు.. పవన్ కళ్యాణ్, రానా మధ్య తీవ్రమైన పోరాటాన్ని కూడా చూపించారు. ఈ ట్రైలర్ లో త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ కనిపించాయి. నిత్యామీనన్ కి కూడా ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు. 

'ఏయ్ రామస్వామి రాయవయ్యా ఎఫ్ ఐ ఆర్.. వీడు బలిసి కొట్టుకుంటున్నాడు.. మనమేంటో చూపిద్దాం' అంటూ పవన్ చెప్పే డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది. నాయక్ పెళ్ళాం అంటే నాయక్ లో సగం కాదు.. నాయక్ కి డబుల్' అంటూ నిత్యా మీనన్ చెప్పే డైలాగ్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్నిచ్చే విధంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. 

పవన్ ఫ్యాన్స్ లో, ట్రెండ్ వర్గాల్లో భీమ్లా నాయక్ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా తొలిసారి నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. మురళి శర్మ, రావు రమేష్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

YouTube video player