ప్రముఖ సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్ తల్లి విజయలక్ష్మి (67) అనారోగ్యంతో మరణించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవారంలో నివాసముంటున్న ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

దీంతో ఆమెని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భాస్కరభట్ల పెద్ద కుమారుడు.

విజయలక్ష్మి అంత్యక్రియలు స్థానిక ఇన్నీసుపేట కైలాసభూమిలో మంగళవారం నాడు జరిగాయి. ఆమె చితికి భాస్కరభట్ల నిప్పంటించారు. ఆమె మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు, సాహితీకారులు భాస్కరభట్లకు తమ సానుభూతి తెలిపారు.