కమల్ హాసన్ నటిస్తున్న `ఇండియన్ 2` ట్రాక్‌లోకి వచ్చింది. సడెన్‌గా ఈ మూవీ అప్ డేట్ ఇచ్చింది టీమ్. రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
లోక నాయకుడు కమల్ హాసన్.. `విక్రమ్` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రెండేళ్ల గ్యాప్‌తో ఇప్పుడు `భారతీయుడు 2`తో రాబోతున్నారు. గతంలో వచ్చిన సంచలన చిత్రం `భారతీయుడు`కి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రిలీజ్‌కి సిద్ధమయ్యింది. కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ అనేక అడ్డంకులు దాటుకుని షూటింగ్ పూర్తి చేసుకుని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది.
తాజాగా రిలీజ్ డేట్ ఇచ్చింది టీమ్. సినిమాని జూన్‌లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సేనాపతి కమ్ బ్యాక్ అంటూనే `ఇండియన్ 2` రాబోతుందని వెల్లడించింది. జూన్‌లో సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే పర్టిక్యూలర్‌గా ఒక డేట్‌ని ఇవ్వలేదు. ఏదో ఒక డేట్‌ని కన్ఫమ్ చేసే అవకాశం ఉంది.
ఇక శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కమల్‌కి జోడీగా కాజల్, సిద్ధార్థ్‌కి జోడీగా ముఖ్య పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. లైకా పిక్చర్స్ నిర్మిస్తుంది. జీరో టోలరెన్స్ అనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సమాజంలో అవినీతితోపాటు అసహనం అనే అంశాల ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది.
ఇక ఈ మూవీ చూడబోతుంటే `కల్కి2898ఏడీ`తో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. `కల్కి` మేలో విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా వేస్తున్నారు. మే చివరి వారంలోగానీ జూన్‌లోగానీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇదే జరిగితే ఇప్పుడు `భారతీయుడు 2`, `కల్కి2898ఏడీ` ల మధ్య పోటీ తప్పుదు. పాన్ ఇండియా స్టార్‌తో కమల్ పోటీ పడాల్సి వస్తుంది. అంతేకాదు `కల్కి`లో కమల్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇలా `కల్కి` వస్తే కమల్‌తో కమల్‌కే పోటీ అని చెప్పొచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.
