బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ల కాంబినేషన్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. వారిద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'భారత్' అనే సినిమాలో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో 'చాష్నీ' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ టీజర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్ లో సల్మాన్, కత్రినాల కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. వీరిద్దరి మధ్య  రొమాన్స్ ని అందంగా చూపించారు దర్శకుడు.

అలీ అబ్బాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో దిశా పటానీ కనిపించనుంది. రంజాన్ కానుకగా జూన్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.