సల్మాన్ ఖాన్ స్టామినా ఏంటో భారత్ సినిమాతో మరోసారి ఋజువవుతోంది. కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ తో భారత్ సినిమా కండల వీరుడికి మంచి బూస్ట్ ని ఇచ్చింది. సెకండ్ డే కాస్త తగ్గినప్పటికీ సెంచరీ ఈజీగా కొట్టేయగలడని అర్ధమవుతోంది. 

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన భారత్ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ 73కోట్లకు చేరింది. సల్మాన్ కి ప్రతి ఏడాది ఈద్ సెంటిమెంట్ కలిసొచ్చినట్లుగానే ఈ ఏడాది రంజాన్ కూడా మంచి సక్సెస్ దొరికింది. మొదటిరోజు భారత్  సినిమా 42.30 కోట్లను కలెక్ట్ చేయగా సెకండ్ డే కొంచెం తగ్గాయి. 

గురువారం 31కోట్లను కలెక్ట్ చేసిన భారత్ టోటల్ గా 73.31కోట్లను అందుకుంది. ఈ దెబ్బతో 100కోట్లను కలెక్ట్ చేయడం సినిమాకు పెద్ద కష్టమేమి కాదు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా సెంచరీ కొట్టేసి సల్మాన్  రేంజ్ ని మరింత పెంచుతుందని చెప్పవచ్చు.