ఈద్ కానుకగా భారీ స్థాయిలో విడుదలైన  'భారత్' సల్మాన్ కెరీర్ లో మరో బెస్ట్ మూవీగా నిలుస్తోంది. మొదటి రోజే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా లాభాలను అందించే దిశగా ప్రయత్నిస్తోందని చెప్పవచ్చు. మొదటి రోజు దాదాపు 35 నుంచి 40 కొట్ల కలెక్షన్స్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. 

వరల్డ్ వైడ్ గా దాదాపు 6 వేలకు పైగా స్క్రీన్స్ లలో రిలీజైన భారత్ అంచనాల ప్రకారం మొదటి రోజు 45కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంతా భావించారు. అయితే సినిమాకు ఇండియా vs సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ మ్యాచ్ కలెక్షన్స్ పై ప్రభావం చూపినట్టు అర్ధమవుతోంది. కోహ్లీ సేనకు 2019 వరల్డ్ కప్ లో ఇదే మొదటి మ్యాచ్ కావడంతో జనాలు హాలిడే రోజు క్రికెట్ కె అంకితమయ్యారు.  

లేకుంటే సినిమా ఫస్ట్ డే 45కోట్లను దాటేదాని సమాచారం. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన భరత్ సినిమాను దాదాపు 100కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ వీక్ లో ఈ సినిమా 100కోట్లను రాబడుతుందా అనేది ఇప్పుడు సందేహంగా మారింది.