సల్మాన్ ఖాన్ మరోసారి అత్యధిక వేగంగా 100కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. ఈద్ కానుకగా విడుదలైన భారత్ సినిమా వరల్డ్ వైడ్ గా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. భారత్ సల్మాన్ కెరీర్ లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ ని అందించిందని చెప్పవచ్చు. 

ఇక సినిమా నాలుగవ రోజు 100కోట్లను దాటేసింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు. మల్టిప్లెక్స్ లో కలెక్షన్స్ జోరు పెరగ్గా సింగిల్ స్క్రీన్స్ లలో అదే జోరు కనిపిస్తోంది. సల్మాన్ సినిమా ఎప్పటిలానే ముంబై వంటి పట్టున్న ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 

మొత్తంగా ఇప్పటివరకు సినిమా 122.20కోట్లను కలెక్ట్ చేసినట్లు తరన్ ఆదర్శ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మునుపటి రోజుకంటే శనివారం కలెక్షన్స్ శాతం పెరిగింది. నాలుగవరోజు సండే కావడంతో ఇంకా పెరిగే అవకాశం ఉన్నా ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్ కాస్త ఎఫెక్ట్ పడేలా ఉన్నట్లు తెలుస్తోంది.