‘భగవంత్ కేసరి’ మూడు వారాల కలెక్షన్లు ఎంత? లాభం ఎన్ని కోట్లు?
నందమూరి నటసింహం నటించిన ‘భగవంత్ కేసరి’ దసరా విన్నర్ గా నిలిచింది. టాక్, కలెక్షన్లలో మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో సందడి చేస్తోంది.
నందమూరి నటసింహం, సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే మంచి టాక్ అందుకుంది. కలెక్షన్ల పరంగానూ అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం మూడు వారాల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సందర్భంగా మూడు వారాల్లో ‘భగవంత్ కేసరి’ అందుకున్న కలెక్షన్లు ఎంత? బ్రేక్ ఈవెంట్ టార్గెట్ పూర్తి చేసుకొని ఎంత లాభాలు అందుకునేది తెలుసుకుందాం. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. మూడు వారాల్లో ఈ చిత్రం రూ.68.68 కోట్ల షఏర్ ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏరియా వైజ్ గా కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.. నైజాం 19.50 కోట్లు, సీడెడ్ రూ.12.77 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.6.28 కోట్లు, ఈస్ట్ రూ.3.56 కోట్లు, వెస్ట్ రూ.2.92 కోట్లు, గుంటూరు రూ.5.43 కోట్లు, కృష్ణా రూ.2.65 కోట్లు, నెల్లూరు రూ.2.71 కోట్లు, ఏపీ మరియు తెలంగాణ రూ.55.82 కోట్లు, మిగితా ఏరియాలో రూ.5.65 కోట్లు, ఓవర్సీస్ రూ.7.21కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
మూడు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇలా రూ.68.68 కోట్ల షేర్ అందుకుందని సమాచారం. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.61 కోట్ల షేర్ ను చేరుకొని.. ప్రస్తుతం లాభాల బాటల్లో నడుస్తోంది. ఇప్పటి వరకు రూ.7.68 కోట్ల మేర ప్రాఫిట్ అందించినట్టు తెలుస్తోంది. మెత్తానికి బాలయ్య ‘భగవంత్ కేసరి’తో హ్యాట్రిక్ హిట్ అందుకోవడం విశేషం. ఈ సక్సెస్ ను అభిమానులతో కలిసి పంచుకునేందుకు ఈరోజు గ్రాండ్ సెలబ్రేషన్స్ కు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో సక్సెస్ వేడుక జరుగుతోంది.
విమెన్ ఎంపవర్ మెంట్ గురించి చెప్పిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela) విజ్జిపాప పాత్రలో జీవించింది. బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ రాంపాల్ విలన్ అలరించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. థమస్ సంగీతం అందించారు.