అన్ స్టాపబుల్ షోలో భగవంత్ కేసరి టీమ్... ఆ రోజు గ్రాండ్ ప్రీమియర్!

బాలయ్య కెరీర్లో అన్ స్టాపబుల్ మైలురాయిగా నిలిచింది. గత రెండు సీజన్స్ భారీ విజయం సాధించాయి. ఆహాకు బాలయ్య అన్ స్టాపబుల్ షో విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. 

bhagavanth kesari team in balakrishna unstoppable show ksr

భగవంత్ కేసరి చిత్ర ప్రమోషన్స్ లో గట్టిగా పాల్గొంటున్నాడు బాలకృష్ణ. ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. వరంగల్ వేదికగా జరిగిన ఈ ప్రమోషనల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ హిట్ ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే మోస్ట్ సక్సెస్ఫుల్ టాక్ షోలో భగవంత్ కేసరి టీమ్ పాల్గొననున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 3 కి రంగం సిద్ధం కాగా భగవంత్ కేసరి యూనిట్ ని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నాడు. 

బాలయ్య కెరీర్లో అన్ స్టాపబుల్ మైలురాయిగా నిలిచింది. గత రెండు సీజన్స్ భారీ విజయం సాధించాయి. ఆహాకు బాలయ్య అన్ స్టాపబుల్ షో విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. మహేష్ బాబు, ప్రభాస్, మహేష్ వంటి టాప్ స్టార్స్ ని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశాడు. ఇక సీజన్ కూడా సరికొత్తగా ప్లాన్ చేశారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి పాల్గొననున్నారట. 

ఇదిలా ఉంటే బాలయ్య అన్ స్టాపబుల్ వేదికగా భగవంత్ కేసరి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. భగవంత్ కేసరి హీరోయిన్ కాజల్ అగర్వాల్, కీలక రోల్ చేసిన శ్రీలీల, విలన్ అర్జున్ రామ్ పాల్, దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొననున్నారు. భగవంత్ కేసరి టీమ్ ఇంటర్వ్యూ అక్టోబర్ 17న ప్రసారం కానుంది. మరి తనతో పని చేసిన టీమ్ ని బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది ఆసక్తికరం. 

భగవంత్ కేసరి చిత్రం తెలంగాణా నేపథ్యంలో సాగుతుంది. తండ్రి-కూతుళ్ళ మధ్య ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. బాలకృష్ణ మార్క్ యాక్షన్ జోడించి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా అనిల్ రావిపూడి తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. బాలయ్య హిందీ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణ. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios