Asianet News TeluguAsianet News Telugu

గీసారి దసరా జోర్దారుంటది.. ‘భగవంత్ కేసరి’ రిలీజ్ డేట్ ఫిక్.. అఫీషియల్ అనౌన్స్ మెంట్

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. నటసింహం బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘భగవంత్ కేసరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. కొద్దిసేపటి కిందనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 
 

Bhagavanth Kesari  Movie Release Date Announcement NSK
Author
First Published Jul 22, 2023, 3:12 PM IST

నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrishna)  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతున్నారు. పవర్ ఫుల్ పాత్రలతో అలరిస్తున్నారు. ఈ ఏడాది ‘వీరసింహారెడ్డి’తో సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దసరాకు మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ Bhagavanth Kesari)  తో రాబోతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు గ్లింప్స్, టీజర్ కు మాసీవ్ రెస్పాన్స్  దక్కింది. బాలయ్యను అనిల్ రావిపూడి సరికొత్తగా ప్రజెంట్ చేయబోతుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన టీజర్ లోనూ బాలయ్య మాస్ అవతార్, పవర్ ఫుల్ డైలాగ్ లకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.దీంతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో బడా స్టార్స్ సినిమాలన్నీ డేట్స్ ను లాక్ చేసుకుంటున్నాయి. 

తాజాగా ‘భగవంత్ కేసరి’ విడుదల తేదీ కూడా వచ్చేసింది. దసరాకు నందమూరి అభిమానుల పండుగా షురూ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది అని, 2023 అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా భగవంత్ కేసరి విడుదల కాబోతోందని అధికారికంగా  ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్  ఫుల్ ఖుషీ అవుతున్నారు. అనౌన్స్ మెంట్ పాటు విడుదల చేసిన పోస్టర్ అదిరిపోయింది. రెండు చేతుల్లో గన్స్ పట్టుకొని రౌద్రరూపంలో బాలకృష్ణ ఆకట్టుకున్నారు. పోస్టర్ చూస్తే యాక్షన్ అదిరిపోనుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తవుతోంది. ఎక్కడా ఆలస్యం లేకుండా చిత్రీకరణ కొనసాగుతోంది. 

ఎప్పుడు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసే బాలయ్య ఈసారి మాత్రం తెలంగాణలో దిగుతుండని ఇప్పటికే అనిల్ రావిపూడి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ యాస, భాషలో బాలయ్య చెప్పే డైలాగ్స్  గూస్ బంప్స్ గా ఉంటాయన్నారు.ఈ విషయం టీజర్ తో అర్థమైంది. ఇక మున్ముందు వచ్చే  అప్డేట్స్ తో సినిమాపై మరింత హైప్ పెరగనుంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తోంది. శ్రీలీలా (Sreeleela) కీలక పాత్ర పోషిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios