బాలకృష్ణ `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన తాజాగా అప్‌డేట్‌ ఇచ్చాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఫస్ట్ సింగిల్‌ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.

వరుస సక్సెస్‌లో ఉన్నాడు బాలయ్య. `అఖండ`, `వీరసింహారెడ్డి` చిత్రాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్‌ అయ్యాయి. దీంతో బాలయ్య క్రేజ్‌ మామూలుగా లేదు. ఆయన సినిమాలకు ఫుల్‌ డిమాండ్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలకృష్ణ `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటిస్తున్నారు. వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్‌.. బాలయ్యకి జోడీగా నటిస్తుంది. శ్రీలీల కూతురు పాత్రలో కనిపించనుందట. 

ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మరో రెండు నెలలో రిలీజ్‌ కాబోతుంది. దీంతో చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ ఆకట్టుకుంది. బాలయ్య లుక్స్ సైతం మెప్పించాయి. సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. `నేలకొండ భగవంత్‌ కేసరి` అంటూ బాలయ్య చెప్పే డైలాగులు గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇది మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. 

ఈ సినిమాకి సంబంధించిన తాజాగా అప్‌డేట్‌ ఇచ్చాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఫస్ట్ సింగిల్‌ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేశారు. ఇందులో టీమ్‌ అంతా బాలకృష్ణ సినిమాల్లోని డైలాగులు చెబుతున్నారు. కానీ అనిల్‌ రావిపూడి వరకు వచ్చే సరికి అందరు డైలాగులు చెబుతున్నారని, పాట అప్‌ డేట్‌ ఇస్తానని చెప్పారు. రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు `భగవంత్‌ కేసరి`లోని ఫస్ట్ సింగిల్‌ విడుదల తేదీని ప్రకటించనున్నట్టు తెలిపారు. 

అయతే ఆగస్ట్ 31 గానీ, సెప్టెంబర్‌ 1న గానీ ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేసే అవకాశం ఉందట. ఇది గణేష్‌ ఉత్సవాలపై వచ్చే సాంగ్‌ అని తెలుస్తుంది. వినాయక చవితి వచ్చే నెలలో ఉన్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాటని విడుదల చేయబోతున్నారని సమాచారం. అంతేకాదు ఇందులో మొత్తం నాలుగు పాటలున్నాయని, అందులో రెండు ముందుగానే విడుదల చేయనున్నారట. మరో పాట ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో, నాల్గో పాట సినిమాలోనే చూపించబోతున్నారట. అది సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. బాలయ్యకి థమన్‌ సంగీతం బిగ్‌ అసెట్‌ అవుతుంది. `అఖండ` నుంచి అది వర్కౌట్‌ అవుతుంది. `భగవంత్‌ కేసరి`తో కలిసి హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాలనుకుంటున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనది నెగటివ్‌ రోల్‌ అని సమాచారం. షైన్‌ స్క్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమాని సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది.