2014లో అల్లుడు శీను సినిమాతో కథానాయకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సక్సెస్ అందుకోవడానికి ఐదేళ్లు పట్టింది. రమేష్ వర్మ తెరకెక్కించిన రాక్షసుడు సినిమా మంచి లాభాలతో దూసుకుపోతోంది.కోలీవుడ్ రాట్ససన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను ఢిల్లీ బాబీ - శ్రీధర్ సంయుక్తంగా నిర్మించారు.  

వివి.వినాయక్ - బోయపాటి శ్రీనివాస్ - తేజ వంటి సీనియర్ బాక్స్ ఆఫీస్ దర్శకులతో పనిచేసినా కూడా దక్కని విజయం ప్లాప్ లిస్ట్ లో ఉన్న దర్శకుడి ధ్వారా సక్సెస్ అందుకున్నాడు. ఇకపోతే నెక్స్ట్ బాలీవుడ్ లో కూడా బెల్లంకొండ బాబు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పిన తండ్రి సురేష్ ఇదే ఆనందంలో కొడుకు పెళ్లి విషయాన్నీ కూడా చెప్పాడు. 

ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో త్వరలో తమ కుటుంబంలోని అమ్మాయినే చూసి సాయి శ్రీనివాస్ కి వివాహం చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది బెల్లకొండ వారి ఇంట్లో పెళ్లి భాజాలు మోగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ గురించి త్వరలోనే ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ రానుంది.