కుర్ర హీరోల్లో ఇప్పుడు యమ స్పీడుగా సినిమాలు చేస్తోన్న వారిలో బెల్లంకొండ వారసుడు సాయి శ్రీనివాస్ ఒకరు. మనోడు రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు సెలెక్ట్ చేస్తున్నాడు. అది కూడా బడా చిత్రాలే కావడం విశేషం. ఇకపోతే రీసెంట్ గా మెగా హీరో సాయి ధరమ్ ప్రాజెక్టును కూడా బెల్లంకొండ తనవైపుకు తిప్పుకున్నట్లు టాక్ వస్తోంది. 

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. సాయి మాధవ్ బుర్ర మరియు గోపి గ్యాంగ్ కలిసి రాసుకున్న ఆ కథను మెగా హీరో మెచ్చాడు కానీ ప్రస్తుతం అతను బిజీగా ఉన్నాడు. దీంతో ఆ కథను బెల్లంకొండ కాంపౌండ్ కు వెళ్లినట్లు సమాచారం. యూ టర్న్ నిర్మాతలు సినిమాను నిర్మించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 4 సినిమాలను లైన్ లో పెట్టాడు. కొత్త డైరెక్టర్ తో మరియు తేజ దర్శకత్వంలో సినిమాలను చేస్తూనే రమేష్ వర్మ కథ, మరో కొత్త డైరెక్టర్ కథను ఒకే చేశాడు. ఇక ఇప్పుడు గోపీచంద్ ప్రాజెక్ట్ కూడా సెట్టవ్వడంతో పెద్దగా గ్యాప్ లేకుండా త్వరలోనే వరుసగా సినిమాలను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.