బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. తేజ దర్శకత్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 24న ఈ సినిమా విడుదల కాబోతోంది.  గత కొన్నేళ్ల‌గా స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతోన్న సాయికి ఈ సినిమా హిట్ కీల‌కం. ఆశ‌ల‌న్నీ ఈసినిమాపైనే ఉన్నాయి. దాంతో  ప‌్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ సంద‌ర్భంగా  ‘సీత’ కథ ని రివీల్ చేసారు.

సాయి మాట్లాడుతూ..‘‘20 సంవత్సరాలు జ‌నాల‌కు దూరంగా, పొల్యూట్ కాకుండా పెరిగిన ఓ అబ్బాయి ఈ జ‌నార‌ణ్యంలోకి వ‌స్తే ఎలా ఉంటుంది? అందులోనూ డ‌బ్బే స‌ర్వ‌స్వం అనుకునే అమ్మాయికి.., తొందరపాటు లేకుండా నిదానమే ప్రదానం అనుకునే అబ్బాయికి మధ్య ప‌రిచ‌యం ఏంటి? అది ఏ తీరాల‌కు దారి తీసింద‌నే ఆసక్తికరమైన కథతో ‘సీత’ చిత్రం తెరకెక్కింది. ఇందులో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేలా తేజగారు తెరకెక్కించారు’’ అని తెలిపారు.

తన పాత్ర గురించి చెప్తూ...ప్ర‌తీ ఒక్క‌రు జీవితంలో నిజాయితీగా ఉండాల‌ని చెప్పేరోల్ నాది. బాగా చ‌దువుకున్న వాడిని కూడా. ఇలా హ్యాపీగా సాగిపోతున్న జీవితంలో సీత ఎదురైతే ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కున్నాను అన్న‌దే క‌థ‌. మ‌రి ఇది సీత టైటిల్? క‌థ ఎక్కువ‌గా ఆమె చుట్టూ తిరుగుతుందా? అని ప్ర‌శ్నిస్తే నాకు మంచి నటుడిగా నిరూపించుకోవాలని ఉంది. కాబట్టి హీరోయిన్ పాత్ర పేరు టైటిల్ గా గల మూవీలో నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాది మంచి పాత్ర అని నాకు పూర్తి నమ్మకం ఉంది అన్నారు.