యంగ్ హీరో  బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం రాక్షసుడు. బెల్లకొండ శ్రీనివాస్ టాలీవుడ్ ఎంట్రీ స్టార్ హీరోల రేంజ్ లో జరిగింది. వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను చిత్రంతో శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం బాగున్నప్పటికీ భారీ బడ్జెట్ కావడంతో కమర్షియల్ గా ఫెయిల్ అయింది. ఆ తర్వాత శ్రీనివాస్ పలు చిత్రాల్లో నటించాడు. ఒక్క చిత్రం కూడా వసూళ్ల పరంగా హిట్ అనిపించుకోలేదు. 

నటన విషయంలో శ్రీనివాస్ ఒక్కోచిత్రానికి ఇంప్రూవ్ అవుతున్నాడు. డాన్సులు బాగా చేస్తాడు. కావలసిందల్లా ఒక్క సాలిడ్ హిట్. గత ఏడాది సాక్ష్యం, కవచం చిత్రాలతో శ్రీనివాస్ కు షాక్ తగిలింది. ఈ ఏడాది నటించిన సీత చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. రాక్షసుడు చిత్రంతో మరోసారి శ్రీనివాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రాక్షసుడు చిత్రం ఆగష్టు 2న విడుదలకు సిద్ధమైంది. తమిళ సూపర్ హిట్ చిత్రం రాక్షసన్ ని ఇది రీమేక్. రాక్షసుడు చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ 14 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు 12.3 కోట్లకు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్ లో ఈ చిత్ర హక్కులు 80 లక్షలకు అమ్ముడయ్యాయి. 

హిట్ కొట్టేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఈ తరుణంలో హిట్ టాక్ వస్తే 14 కోట్లకు రాబట్టడం పెద్ద కష్టం కాదు. పైగా తమిళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో అయినా శ్రీనివాస్ తొలి కమర్షియల్ హిట్ దక్కించుకుంటాడో లేదో చూడాలి.