జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న బెల్లకొండ వారబ్బాయి సాయి శ్రీనివాస్ నెక్స్ట్ కవచం సినిమాతో రాబోతున్నాడు. కాజల్ అగర్వాల్ - మెహ్రీన్ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. ఇకపోతే సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఎప్పటిలానే ఈ యువ హీరో ఫుల్ యాక్షన్ కథతో రాబోతున్నట్లు చూపించేశాడు. 

పోలీస్ అండ్ విలన్ మైండ్ గేమ్ తరహాలో సినిమా సాగుతుందని అర్ధమవుతోంది. సినిమాలో ఊహించని ట్విస్ట్ అందరిని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఇదివరకే వివరణ ఇచ్చింది. ఇకపోతే డైలాగ్స్ తో మాస్ ఆడియెన్స్ ను సాయి ఎట్రాక్ట్ చేస్తున్నాడు.  'పద్మవ్యూహంలో ఆగిపోవడానికి నేను అభిమాన్యున్ని కాదురా..పోలీస్.." అనే డైలాగ్ తో సాయి ఆకర్షిస్తున్నాడు. 

మరి ఇప్పటివరకు వచ్చిన యాక్షన్ కథలతో కమర్షియల్ హిట్ పెద్దగా అందుకొని బెల్లంకొండ వారసుడు ఇప్పుడైనా ఈ కవచంతో హిట్టు అందుకుంటాడో లేదో చూడాలి. వంశీధర క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ మామిలా దర్శకత్వం వహించగా థమన్ సంగీతాన్ని అందించాడు. డిసెంబర్ 7న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు.