ప్లాప్ మూవీతో ప్రపంచ రికార్డ్, షాక్ ఇచ్చిన బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్..
ఒక ప్లాప్ సినిమాతో.. ప్లాప్ హీరో రికార్డ్ సాధించాడు అంటే నమ్ముతారా..? కాని ఇది నిజం కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాను నటించిన ఓ ప్లాప్ మూవీతో వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఎలాగంటే..?
హీరోగా సెటిల్ అవ్వడం కోసం దాదాపు 10 ఏళ్లుగా కష్టపడుతున్నాడు బెల్లంకొండ వారసుడు సాయిశ్రీనివాస్. మాస్ హీరోగా సెటిల్ అవ్వాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు బెల్లంకొండ. అందుకోసం చాలా కష్టపడ్డాడు. వినాయక్ డైరెక్షన్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్.. బోయపాటి తో కూడా సినిమా చేశాడు. మాస్ ఇమేజ్ అయితే తెచ్చుకున్నాడు కాని.. హీరోగా మాత్రం నిలబడలేకపోతున్నాడు. ఆకరికి చత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ కూడా చేశారు. కాని మనోడికి అది కూడా కలిసి రాలేదు.
అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కమర్షియల్ పరంగా ఇండస్ట్రీ హిట్స్ ఎక్కువగా కొట్టకపోయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సాయి శ్రీనివాస్ కు హిందీలో హిందీలో ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతి సినిమా యూట్యూబ్ లో హిందీ డబ్ అవుతుంది. రిలీజ్ అయ్యి భారీ వ్యూస్ సంపాదిస్తుంటాయి. అలా బాగా పాపులర్ అయిన బెల్లంకొండ సినిమా ఒకటి రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేసి.. వరల్డ్ రికార్డ్ ను సాధించింది.
బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయ జానకి నాయక సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా థియేటర్స్ లో యావరేజ్ టాక్ తో నడిచింది. అయితే ఇదే మూవీ హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. జయ జానకి నాయక సినిమా నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. దీంతో ఈ మూవీ ప్రపంచంలో ఏ సినిమా అందుకొని రికార్డుని క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఏకంగా 800 మిలియన్ వ్యూస్ సాధించిన మొదటి సినిమాగా జయ జానకి నాయక వరల్డ్ రికార్డు సృష్టించింది.
ఇక ఈ విషయాన్ని జయ జానకి నాయక హిందీ రైట్స్ కొనుక్కున్న పెన్ మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.ఇంతే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కవచం సినిమా వేరువేరు ఛానల్స్ లో హిందీలో అన్ని కలిపి 800 మిలియన్ వ్యూస్ కి పైగా సాధించింది. ఇక సీత సినిమా ఒక్క ఛానల్ లోనే ఏకంగా 640 మిలియన్ వ్యూస్ కి పైగా సాధించింది. ఈ రేంజ్ లో ఇన్ని మిలియన్స్ వ్యూస్ తన సినిమాలతో సాధించిన ఏకైక హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ రికార్డ్ సాధించాడు. ప్రస్తుతం బెల్లంకొండ హీరో సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ స్టోరీతో సినిమా చేస్తున్నాడు.