ఈ మద్యకాలంలో  సోషల్ మీడియాలో చాలా స్పీడుగా ఉంటున్నారు సూపర్ స్టార్ మహేష్.  క్రిడల దగ్గర నుంచి సామాజిక అంశాలు దాకా ప్రతీ విషయంపై తన స్పందనను తెలియచేస్తున్నారు. మంచి సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. తన కు నచ్చిన సినిమాలను అభినందిస్తున్నారు. అయితే ఆయన తెలుగులో ఈ మధ్యకాలంలో వచ్చి హిట్టైన ఇస్మార్ట్ శంకర్ గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 

నిజానికి చాలా రోజులుగా వరుస ప్లాఫ్ లతో సతమతమవుతున్న డైరెక్టర్ పూరీ, హీరో రామ్‌కు `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్  ఆక్సిజన్ అందించింది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించారు. అయితే పూరీతో కలిసి `పోకిరి`, `బిజినెస్‌మేన్` వంటి సినిమాలు చేసిన సూపర్‌స్టార్ మహేష్ మాత్రం స్పందించలేదు.అయితే ఎందుకు ఆయన స్పందించలేదో  అందరికీ తెలుసుకాబట్టి లైట్ తీసుకున్నారు.

వాస్తవానికి ఇస్మార్ట్ శంకర్ గురించి మహేష్ ట్వీట్ చేద్దామనుకున్నారట. అయితే ఈ లోగా మహేష్  తో తను సినిమా జనగణమన  చేయలేనంటూ  పూరి జగన్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. హిట్ ఉన్న దర్శకులతోనే మహేష్ చేస్తారని అన్నారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ కు పిచ్చ కోపం వచ్చింది. ఈ విషయం పెద్దదైంది. మీడియాలో కొద్ది రోజులు హాట్ టాపిక్ గా నడిచింది. దాంతో ఖచ్చితంగా ఈ టాపిక్ మహేష్ దాకా చేరే ఉంటుంది. దాంతో ఆయన ట్విట్ చేద్దామనుకున్నా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పకుండా మహేష్ ఇగో అడ్డుపడిందని అంటున్నారు. పూరి జగన్నాథ్ వ్యాఖ్యలకు మహేష్ మనస్సు గాయపడిందని అందుకే ఆయన స్పందించలేదని చెప్తున్నారు.

మరో ప్రక్క  హీరో రామ్, మహేష్‌ కలిసి మాట్లాడుకుంటున్నట్టున్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇస్మార్ట్ గెటప్‌లో ఉన్న రామ్‌, మహేష్‌ మధ్య  మాటలు జరిగాయి. రీసెంట్ గా బిగ్ బాస్ షో కోసం అన్నపూర్ణకు వచ్చిన రామ్ అక్కడే షూట్ లో ఉన్న మహేష్ ని కలిసారు. మహేష్ స్వయంగా రామ్ ని కంగ్రాట్స్ చేసారని, ఇస్మార్ట్ శంకర్ లో బాగా చేసావని మెచ్చుకున్నారని తెలుస్తోంది.