Beast Movie telugu version Closing Collections Beast: తెలుగు 'బీస్ట్' క్లోజింగ్ కలెక్షన్స్.. దిల్ రాజుకి  ఎంత నష్టం

“కో కో కోకిల, డాక్టర్” వంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో ప్రామిసింగ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. ఆయన దర్శకత్వం వహించిన “బీస్ట్” సినిమా విడుదలైంది. స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో విశేష ప్రేక్షక ఆదరణ చూరగొన్న “మనీ హేస్ట్” మాదిరి కంటెంట్ తో తెరకెక్కింది “బీస్ట్” అనే ప్రచారం నడిచింది. కామెడీ విషయంలో నెల్సన్ కు మంచి గ్రిప్ ఉందన్న విషయాన్ని, తొలి రెండు సినిమాలు “కో కో కోకిల, డాక్టర్” స్పష్టం చేసాయి. అదొక ప్లస్ గా మారింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఏ మేరకు సగటు ప్రేక్షకుడుని ఎంటర్టైన్ చేసింది...అంటే కొంతమేరకే అని చెప్పాలి.

 ఈ సినిమా మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయి. కానీ ఆ తర్వాత రోజే ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ‘కేజిఎఫ్ 2’ విడుదల అవ్వడంతో ‘బీస్ట్’కి లాస్ స్టార్టైంది. ‘కేజిఎఫ్ 2’ సినిమా ఫస్ట్ డే నుంచే హిట్ టాక్ తెచ్చుకొని పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో కలెక్షన్లని కొల్లగొట్టింది. చాలా ఏరియాలలో ‘కేజిఎఫ్ 2’ సినిమాకి ఉన్న రెస్పాన్స్ చూసి బీస్ట్ ని తీసేసారు. విజయ్ సొంత రాష్ట్రం తమిళనాడులో కూడా ‘కేజిఎఫ్ 2’ కోసం బీస్ట్ ని థియేటర్స్ లో నుంచి తీసేసారు. దీంతో బీస్ట్ సినిమా భారీ నష్టాలని మూటకట్టుకుంది.

ఇక బీస్ట్ సినిమాని తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో బీస్ట్ సినిమాతో విజయ్ ని మరింత ప్రమోట్ చేస్తే తన సినిమాకి పనికొస్తుందని దిల్ రాజు గతంలో విజయ్ సినిమాల కంటే ఎక్కువ రేటు పెట్టి తెలుగు రైట్స్ కొన్నారు. విజయ్ గత సినిమా మాస్టర్ తెలుగులో 6 కోట్లకు అమ్ముడవ్వగా బీస్ట్ సినిమాని దిల్ రాజు 11 కోట్లకి కొన్నారు. కేజిఎఫ్ థియేటర్లలో నడుస్తుండటంతో బీస్ట్ తెలుగులో థియేట్రికల్ రన్ క్లోజ్ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో బీస్ట్ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్

నైజాంలో 2.45 కోట్లు

సీడెడ్‌లో 1.10 కోట్లు

ఉత్తరాంధ్రలో 0.90 కోట్లు

ఈస్ట్ లో 0.63 కోట్లు

వెస్ట్ లో 0.62 కోట్లు

గుంటూరులో 0.80 కోట్లు

కృష్ణాలో 0.52 కోట్లు

నెల్లూరులో 0.40 కోట్లు వసూలు చేసింది.

మొత్తంగా ఏపీ, తెలంగాణలో బీస్ట్‌ సినిమాకి 7.42 కోట్ల షేర్ వసూలు అయింది. ‘బీస్ట్’ సినిమా తెలుగులో దాదాపు 11 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే కనీసం 12 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంది. కానీ బీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో 7.42 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టడంతో దాదాపు 4 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చింది.

 ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ OTT హక్కులు SunNxt, ఇంకా Netflix వద్ద ఉన్నాయి. సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత మాత్రమే OTTలో విడుదల చేయాలనేది ఒప్పందం. అయితే బీస్ట్ అనుకున్నంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో ముందే రావోచ్చని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది.