Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: వెయిటర్‌ షణ్ముఖ్‌కి చుక్కలు చూపించిన సిరి.. బీబీ హోటెల్‌.. నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ని పీక్‌లోకి తీసుకెళ్లారు ఇంటి సభ్యులు. బీబీ హోటల్‌ ఎపిసోడ్‌ నవ్వులు పూయించింది. మరోవైపు స్వీట్‌ తినేసి సన్నీ తనదైన స్టయిల్‌లో ఎంటర్‌టైన్‌ చేశాడు. 

bb hotel episode highlight in biggboss telugu 5 66th day
Author
Hyderabad, First Published Nov 11, 2021, 12:05 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5).. 67వ ఎపిసోడ్‌(66వ రోజు) బిగ్‌బాస్‌ హౌజ్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ చోటు చేసుకుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 5లోనే ఇది అత్యంత ఎక్కువగా నవ్వులు పంచిన రోజుగా నిలిచింది. BB Hotel Taskలో తమ పాత్రల్లో ఇంటి సభ్యులు పరకాయ ప్రవేశం చేసి షోని రక్తికట్టించారు. మొదటగా ఎపిసోడ్‌ ప్రారంభంలో నిన్నటి స్వీట్‌ గురించి డిస్కషన్‌ జరిగింది. ఎవరు తినాలనే దానిపై అంతా చర్చించుకున్నారు. మల్లగుల్లాలు పడ్డారు. బిగ్‌బాస్‌ ఏమైనా చెబుతాడేమో అని వెయిట్‌ చేశారు. కానీ ఆయన్నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న జెస్సీని అడగ్గా.. ఆయన రవి పేరు చెప్పాడు. 

మరోవైపు హౌజ్‌లో ఎవరు దాన్ని తినాలనేదిపై చర్చించుకున్నారు. కెప్టెన్‌గా తనకు అర్హత ఉందని అనీ మాస్టర్, తాను తినాలనుకుంటున్నట్టు రవి, తాను తింటానని సన్నీ, సిరి, శ్రీరామ్‌, కాజల్‌ అన్నారు. ప్రియాంకని అడగ్గా ఆమె మానస్‌కి ఇస్తానని చెప్పింది. దీంతో సన్నీ ఆమెపై పంచ్‌లు పేల్చాడు. అనంతరం రవి ఆ స్వీట్‌ని టేస్ట్ చేశాడు, కాజల్‌ చూసింది. చివరికి సైలెంట్‌గా సన్నీ దాన్ని తినేశాడు. అయితే దీనిపై అనీ మాస్టర్‌ సీరియస్‌ అయ్యింది. తాను తినాల్సింది అని, అడగ కుండా ఎలా తింటావంటూ సన్నీని నిలదీసింది. ఆయనపై ఫైర్‌ అయ్యింది. ఆకలేసింది తినేశా అంటూ సముదాయించుకున్నాడు సన్నీ.  దీనిపై సన్నీ తాగుబోతులా యాక్ట్ చేస్తూ సెటైర్లు వేస్తూ నవ్వులు పూయించాడు. 

అనంతరం బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా సభ్యులంతా హోటల్‌ స్టాఫ్‌గా చేయాల్సి ఉంటుంది. వారిలో ఒక్కొక్కరి ఒక్కో రోల్‌ ఇచ్చాడు. అనీ మాస్టర్‌ చెఫ్‌గా, మేనేజర్‌గా చేయాల్సి ఉంటుంది. శ్రీరామ్‌, షణ్ముఖ్ వెయిటర్స్ గా, రవి హౌజ్‌ కీపర్‌గా, కాజల్‌ యాటిట్యూడ్‌ చూపించే గెస్ట్ గా, సిరి డాన్‌ కూతురిగా, మానస్‌, ప్రియాంక హనీమూన్‌కి వచ్చిన జంటగా నటించాల్సి ఉంటుంది. సన్నీ విలేజ్‌ నుంచి వచ్చి విచిత్రంగా బిహేవ్‌ చేసే గెస్ట్ గా కనిపిస్తాడు. 

అయితే ఈ టాస్క్ కి ముందు రవికి బిగ్‌బాస్‌ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అతను ఇంట్లో అన్ని పనులను డిస్టర్బ్ చేయడం, డబ్బు దొంగిలించడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఆ విషయం ఎవరికీ చెప్పకూడదు, ఎవరికి అనుమానం రాకుండా చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో సభ్యులు అత్యధికంగా డబ్బుని సంపాదించాల్సి ఉంటుంది. ఎవరి వద్ద అయితే ఎక్కువ మనీఉంటుందో వాళ్లు కెప్టెన్సీ టాస్క్ కి అర్హులు.

ఈ టాస్క్ ప్రారంభమైన తర్వాత అసలు ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టార్ట్ అయ్యింది. కాజల్‌ హోటల్‌లోకి వచ్చిన తన యాటిట్యూడ్‌ చూపించింది. శ్రీరామ్‌, షణ్ముణ్‌, రవిలను ఓ రేంజ్‌లో ఆడుకుంది. అనంతరం సన్నీ వచ్చాడు. యానీ మాస్టర్ బుర్ర తిన్నాడు. తనదైన యాస మాట్లాడుతూ కామెడీ పుట్టించాడు. టిప్పు అడిగిన అనీ మాస్టర్ కి `మార్నింగ్‌ వాము వాటర్‌ తాగితే బాత్‌ రూమ్‌ ఫ్రీగా ఉంటుంద`ని చెప్పి అదే టిప్పు అంటూ వెళ్లిపోయి షాకిచ్చాడు. ఇక బెడ్‌రూమ్‌లో టాయిలెట్‌ కోసం రవిని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. సన్నీ రెచ్చిపోయి షో చేశాడు. కామెడీని పండించాడు. అటూ ఇటు తిరుగుతూ అందరి సహనంతో ఆడుకున్నాడు. 

మరోవైపు సిరి సైతం తన యాటిట్యూడ్ చూపించింది. కాఫీ కలుపుకురావాలని షణ్ముఖ్‌కి చెబుతుంది. అందులో షుగర్‌ ఎక్కువైందని ఫైర్‌ అవుతుంది. ఆ తర్వాత తనపై కాఫీ చుక్కలు పడటంతో తుడుచుకుంటుంది. పాట పాడాలని, దానికి తగ్గట్టు డాన్సు చేయాలని చెప్పగా శ్రీరామ్‌ పాట పాడతాడు, షణ్ముఖ్‌ డాన్స్ చేస్తాడు. తనని సాటిస్పై చేస్తే టిప్పు ఇస్తానని చెబుతుంది. వీరిద్దరు కాసేపు పాట పాడి డాన్సులు చేశారు. మధ్యలో ఆపేయడంతో టిప్పు కాన్సిల్‌ అన్నారు. 

ఇంకో వైపు మానస్‌,ప్రియాంక హనీమూన్‌కి ఆ హోటల్‌కి వస్తారు. ప్రియాంకని గోకేందుకు సన్నీ ప్రయత్నిస్తుంటాడు. అది నచ్చలేదని గోల చేస్తుంది ప్రియాంక. అంతేకాదు ఆమెతో జాగ్రత్త అంటూ మానస్‌కి చెబుతాడు. మరోవైపు తనని రవి ఇంప్రెస్‌ చేయాలని అలా చేస్తే టిప్పు ఇస్తానంటుంది కాజల్‌. దీంతో రవి ఆ ప్రయత్నాలు చేస్తుండగా, మధ్యలో సిరి హౌజ్‌లోకి వస్తుంది. దీంతో రవి డిస్టర్బ్ అవుతాడు. ఆ కోపంతో తన బ్యాగ్‌ మర్చిపోయి వెళ్తుంది కాజల్‌. అది చూసిన రవి.. ఆ బ్యాగ్‌లో నుంచి డబ్బులు కొట్టేస్తాడు. ఆ తర్వాత శ్రీరామ్‌,షణ్ముఖ్‌లకు టిప్పు ఇవ్వాలనుకున్నప్పుడు డబ్బు లేకపోవడంతో గోల పెడుతుంది. 

ఇంకో వైపు టిప్పు కోసం షణ్ముఖ్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటుంది సిరి. స్విమ్మింగ్‌ పూల్‌లో స్ఫూన్‌తో వాటర్‌ కాఫీ కప్‌లో పోయిస్తుంది. ఇంకో వైపు తప్పు చేసిన శ్రీరామ్‌ని సోఫాల చుట్టూ తిప్పిస్తూ సారీ చెప్పించుకుంటుంది. ఇలా సిరి, కాజల్‌, సన్నీ ఓ వైపు హోటల్‌ సిబ్బందికి చుక్కలు చూపిస్తుంటారు. ఇంకో వైపు ప్రియాంక, మానస్‌ సైతం ఇబ్బంది పెడుతుంటారు. ఇవన్నీ ఫన్నీగా సాగడంలో ఆడియెన్స్ కి మంచి వినోదాన్ని పంచాయని చెప్పొచ్చు. ఇలా 67వ ఎపిసోడ్‌ బిగ్‌బాస్‌ 5లో మంచి ఎంటర్‌టైనింగ్‌ డేగా నిలిచిందని చెప్పొచ్చు. 

బిగ్‌బాస్‌ తెలుగు 5 పదో వారానికి చేరుకుంది. ఇప్పటి వరకు హౌజ్‌నుంచి తొమ్మిది మంది ఎలిమినేట్‌ అయ్యారు. అనారోగ్యం కారణంగా  జెస్సీని సీక్రెట్‌ రూమ్‌లో ఉంచారు. ప్రస్తుతం పదో వారికి సన్నీ, మానస్‌, సిరి,కాజల్‌, రవి నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు బయటకు వెళ్లిపోతారనేది ఆసక్తిగా మారింది. 

also read: Bigg Boss Telugu 5: శ్రీరామ్ కు సోనూసూద్ మద్దతు, వీడియో వైరల్.. బిగ్ బాస్ విజేత అతడేనా!

Follow Us:
Download App:
  • android
  • ios