Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 15 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో దివ్య ఇంటికి వెళ్లగా ఇంట్లో నుంచి గట్టిగా నవ్వులు వినిపించడంతో ఎవరొచ్చారు అబ్బా అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇంతలోనే దివ్య అక్కడికి రావడంతో అందరూ విడాకుల విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతూ ఉంటారు. అప్పుడు వాసుదేవ్ ఎవర్రా ఈ అమ్మాయి అనడంతో నా కూతురు దివ్య అని అంటాడు నందు. దివ్య వాసుదేవ్ ప్రశునాంబ ని పలకరిస్తుంది. అప్పుడు లాస్య టెన్షన్ తో దివ్య లోపలికి వెళ్లి ఫ్రెష్ అయ్యి రా తిరిగా మాట్లాడుకుందాం అని అంటుంది. అప్పుడు వాసుదేవ్ కోపంగా చూడడంతో హాస్పిటల్ నుంచి వచ్చింది కదా అనడంతో మాట్లాడుతున్నాం కదా మధ్యలో అన్నింటికీ ఎందుకు తల దూరుస్తావు ఈ అలవాటు పోదా అని అంటాడు.

అప్పుడు వీళ్ళు ఎప్పుడు పోతారు స్వామి అని మనసులో అనుకుంటూ ఉంటుంది లాస్య. వాసుదేవ్ కామెడీగా తులసి నీకు నందు సైగలు చేస్తున్నాడు చూడు అనగా లాస్య కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు దివ్య నాన్న అమ్మకు సైగలు చేయడం ఏంటి అసలు ఏం జరుగుతోంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వాసుదేవ్ పిల్లలందరూ సెటిల్ అయ్యారు మీకు సంతోషమే కదా అమ్మ అనగా ఏ తల్లీ అయిన అదే కదా అన్నయ్య కోరుకునేది అని అంటుంది తులసి. పైకి అలా అంటుంది కానీ లోపల అసంతృప్తి నాకే తెలుసు అంకుల్ అని అంటుంది దివ్య. అప్పుడు ఏం మాట్లాడుతున్నావ్ దివ్య అనగా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.

అందరికీ అన్ని చేసి తను మాత్రం ఏమీ చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది అనడంతో అర్థం కాలేదు అమ్మ అనడంతో కలిసి జీవించాలి అనుకున్న వారి నుంచి విడిపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా అంకుల్ అని అంటుంది. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. అయినా మీ అమ్మ ఎవరికి దూరమైంది అనడంతో ఇంతలో లాస్య మధ్యలో కలుగజేసుకొని పిల్లలిద్దరూ కొంచెం దూరం అయ్యారు కదా అందుకే అలా మాట్లాడుతూ ఉంది అని అంటుంది. అయినా దివ్య స్నానం చేయండి నువ్వు మాతో మాట్లాడవు కదా అని చేయి పట్టుకుని పిలవడంతో వెంటనే దివ్య ఏంటమ్మా ఇది నా బాధ్యత నీది కదా మధ్యలో లాస్య ఆంటీ కలుగ చేసుకుంటుంది ఏంటి అని అంటుంది.

అన్నింటి లోకి మధ్యలోకి దూరిపోతుంది అంటూ వాసుదేవ్ సీరియస్ అవుతాడు. మరొకవైపు బసవయ్య, ప్రసూనాంబ కలసి విక్రమ్ మీద లేనిపోనివన్నీ చెప్పి రాజ్యలక్ష్మి మరింత రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడు రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ వాడు కీలుబొమ్మ నేను చెప్తే నిప్పుల్లో అయిన దూకేస్తాడు. నా గుప్పెట్లో నుంచి జారిపోడు అని అనగా ఇప్పుడు బసవయ్య వాడిని నువ్వు హిప్నోటైజ్ చేయడం కాదు వాడే నిన్ను నేను హిప్నోటైజ్ చేసినట్టు ఉన్నాడు అంటూ మరింత రెచ్చగొడుతూ ఉంటాడు. వాడి మాయలో నుంచి బయటకు రా అక్కయ్య. ఇది కోట్లకు సంబంధించిన వ్యవహారం అంత లేజీగా ఉండొద్దు అని అంటాడు.

ఇంతలోనే విక్రమ్ దేవుడు సంతోషంగా లోపలికి రావడంతో అప్పుడు రాజ్యలక్ష్మి ఆకలి అవుతున్న నీకోసం ఎదురుచూస్తున్నాను నాన్న అనడంతో నాకోసం ఎందుకమ్మా ఎదురు చూడటం నాకు ఆకలిగా లేదు నువ్వు తినేసేయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసావ్ కదా అక్క వాడు కనీసం నిన్ను పట్టించుకోను కూడా లేదు వాడిలో చాలా మార్పు వచ్చింది అని బసవయ్య అనగా ఇన్ని రోజులు పూజలు వ్రతాల పేరుతో చెప్పి వారిని దగ్గర చేసుకున్నాను ఇప్పుడు మళ్లీ అదే వర్కౌట్ చేయాలి. మీరు కూడా వానిపై ఒక కన్ను ఉంచండి అని అంటుంది రాజ్యలక్ష్మి. మరొకవైపు తులసి తీరికగా కూర్చుని పాటలు వింటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దివ్య వస్తుంది. అప్పుడు దివ్య ఫోన్ లాక్కొని ఏంటమ్మా ఇంట్లో ఏం జరుగుతుంది అని అంటుంది.

ఏమైంది దివ్య అనగా నా నోటితో చెప్పించుకోవాలని అనుకుంటున్నావా నువ్వు చాలా మారిపోయావు అమ్మ అనడంతో ఇంతలో అక్కడికి పరంధామయ్య వస్తాడు. మీ అమ్మ మారడం అంటూ ఎప్పటికి జరగదు అమ్మ అని పదందామయ్య అనడంతో ఇంతకీ దేన్ని ఉద్దేశించిన అలా మాట్లాడుతున్నావు అంటుంది తులసి. ఎవరినైతే నువ్వు దూరం పెట్టాలి అనుకుంటున్నావు ఎవరికైతే దూరంగా ఉండాలి అనుకుంటున్నావు ఆ మనిషి చెప్పినట్టు వినడం మాత్రమే కాకుండా ఆ మనిషికి అనుగుణంగా నడుచుకుంటున్నావు అని కోపంగా మాట్లాడుతుంది దివ్య. నువ్వు పొరపడుతున్నావు దివ్య నేను లాస్య చెప్పిందని వాసుదేవ్ అంకుల్ ముందు నటించడం లేదు మీ నాన్న కోసం నటిస్తున్నాను అనడంతో దివ్య ఆశ్చర్యపోతుంది. అయినా నమ్మకం లేదా అనడంతో దేవుడినైనా అనుమానిస్తానేమో కానీ ఈ అమ్మని మాత్రం అనుమానించను అని అంటుంది దివ్య.

నువ్వు నాన్న పక్క పక్కన నిలుచుంటే చూడ్డానికి ఎంతో సంతోషంగా ఉంది ఈ క్షణాలు ఇలాగే పరిమితమైపోతే చాలా బాగుంటుంది. ఇది నీ కూతురు కోరిక తీరుస్తావా అమ్మ అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది దివ్య. అప్పుడు దివ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు తులసి దివ్య అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు విక్రమ్ దివ్య తో మాట్లాడిన మాటలు గుర్తుతెచ్చుకొని సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు పక్కన కూర్చొని ఇప్పుడు అంతలా మురిసిపోవడం అవసరమా అనడంతో ఏమో దేవుడు కళ్ళు మూసుకుంటే తనే నవ్వే గుర్తుకొస్తుంది అని అంటాడు.

అప్పుడు విక్రమ్ మీద దేవుడు సెటైర్లు వేస్తూ ఉంటాడు. మరొకవైపు దివ్య జరిగిన విషయాలు తలచుకొని సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత నీకు ఏదైనా సలహా వస్తే చెప్పు కానీ నా మీద సెటైర్లు వేసావో అనడంతో అంత సీరియస్ అవ్వకండి బాబు మీ ఫోన్ ఓపెన్ చేసి ఆ అమ్మాయికి మెసేజ్ చేయండి అని దేవుడు సలహా ఇస్తాడు. అప్పుడు హాయ్ అని విక్రమ్ మెసేజ్ చేస్తాడు. వెంటనే రిప్లై రావడంతో విక్రమ్ సంతోష పడుతూ ఉంటాడు. మరోవైపు దివ్య కూడా గురుడు మెసేజ్ చేశాడు పలకరిద్దాము అని తిన్నారా అని వాయిస్ మెసేజ్ పంపుతుంది. అప్పుడు ఆ వాయిస్ మెసేజ్ విని విక్రమ్ సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు ఆ మెసేజ్ వైపు దివ్య ఫోటో వైపు చూసి విక్రం గంతులు వేస్తూ సంతోష పడుతూ ఉంటాడు.

 మరోవైపు దివ్య కూడా సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత వాసుదేవ్ వాళ్ళు భోజనం చేసి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. అప్పుడు తులసి చేసిన వంటకాలను పొగుడుతూ ఉంటాడు వాసుదేవ్. అప్పుడు వాసుదేవ్ కి తిన్నది సరిగ్గా అడగలేదు అనడంతో ఇంతలో లాస్య టాబ్లెట్ తీసుకొని రావాలా అనగా ప్రతి దానికి మధ్యలో దూరకు అని సీరియస్ అవుతాడు. అప్పుడు కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు వెళ్ళు వెళ్లి జీలకర్ర వేసుకొని మజ్జిగ కలుపుకొని రా అనడంతో వాడు చెబుతున్నాడు కదా లాస్య వెళ్లి తీసుకుని రా అని అంటాడు నందు. అదేంటిరా ఏదో పెళ్ళాన్ని బ్రతిమాలినట్లు బ్రతిమిలాడుతున్నావు అని అంటాడు. అదేం లేదు అని నందు ఇబ్బంది పడుతూ ఉంటాడు.