Asianet News TeluguAsianet News Telugu

Bangarraju: సినిమా చూశాక ఫ్యాన్స్ మీసం తిప్పుతారు... బంగార్రాజు సక్సెస్ మీట్ లో నాగార్జున ఎనర్జిటిక్ కామెంట్స్

బంగార్రాజు ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. సినిమా విజయంపై గట్టి కాన్ఫిడెంట్ కనబరిచారు. సంక్రాంతికి విడుదల చేయడం కోసం తన టీమ్ ఎంతో కష్టపడింది చెప్పిన నాగార్జున... వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు. 

bangarraju pre release event nagarjuna full confident about movie success
Author
Hyderabad, First Published Jan 13, 2022, 10:23 PM IST

బంగార్రాజు మూవీతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు నాగార్జున-నాగ చైనత్య.  దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ అంశాలు కలగలిపి పర్ఫెక్ట్ సంక్రాంతి (Sankranthi 2022) చిత్రంగా జనవరి 14న విడుదలవుతుంది. కాగా నేడు బంగార్రాజు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున, నాగ చైతన్య , అనసూయ, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, హీరోయిన్ దక్ష నగర్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ హాజరయ్యారు. నాగార్జున, నాగ చైతన్య పంచ కట్టులో సంక్రాంతి అల్లుళ్ళ మాదిరి తయారై రాగా.. ఈవెంట్ కి ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. బంగార్రాజు చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించారు. రమ్య కృష్ణ కీలక రోల్ చేస్తున్నారు. 

ఇక ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున (Nagarjuna) చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. సినిమా విజయంపై గట్టి కాన్ఫిడెంట్ కనబరిచారు. సంక్రాంతికి విడుదల చేయడం కోసం తన టీమ్ ఎంతో కష్టపడింది చెప్పిన నాగార్జున... వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణపై ప్రశంసలు కురిపించారు. సెట్స్ లో నవ్వుతు తన పని తాను పూర్తి చేశాడు. ఒక్క రోజు కూడా ఆ ముఖంపై నవ్వు లేకుండా చూడలేదు. ఇది చిన్న సినిమా కాదు, అంత మంది యాక్టర్స్ ని , టీమ్ ని మేనేజ్ చేసి మంచి సినిమా తీశావు అన్నారు. 

ఇంకా నాగార్జున మాట్లాడుతూ బంగార్రాజు పర్ఫెక్ట్ సంక్రాంతి చిత్రం. ఈ మూవీలో చైతన్య, నను మీసం తిప్పాము. సినిమా చూశాక ఫ్యాన్స్ మీరు మీసం తిప్పుతారు అన్నారు. ఇక మూవీలో కంప్లీట్ గా ఓ కొత్త నాగ చైతన్యను చూస్తారు. మాస్ ఇమేజ్ కావాలంటున్న మీ కోరిక ఈ సినిమాతో చైతూ తీరుస్తాడు అన్నారు. ఇక సినిమా గురించి మరింత సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. కోవిడ్ ఆంక్షల వలన ఎక్కువ మంది ఫ్యాన్స్ తో ఈవెంట్ ఏర్పాటు చేయలేకపోయాము. సక్సెస్ మీట్ మాత్రం ఘనంగా చేసుకుందాం అన్నారు. హీరోయిన్ కృతి శెట్టితో పాటు నటులు, సాంకేతిక నిపుణులకు పేరు పేరున నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. 

ఇక నాగ చైతన్య(Naga Chaitanya) మాట్లాడుతూ బంగార్రాజు(Bangarraju) మూవీలో ప్రతి సీన్ ఫుల్ ఎనర్జీతో ఉంటుందన్నారు. సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుపెట్టాం. సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అనే డౌట్ ఉండేది. నాన్న ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అంటూ దైర్యం చెప్పేవారు. ఆయన విశ్వాసం, మేనేజ్మెంట్ కారణంగా రేపు సినిమా విడుదల అవుతుందన్నారు. 

కృతి శెట్టి (Krithi Shetty)చేసిన సర్పంచ్ నాగలక్ష్మి పాత్ర ఫుల్ గా ఎంజాయ్ చేస్తారని నాగ చైనత్య ఆడియన్స్ కి హామీ ఇచ్చారు. బంగార్రాజు సంక్రాంతి సినిమా అని చూశాక మీరే చెప్తారన్నారు. మొత్తంగా నాగార్జున, నాగ చైనత్య బంగార్రాజు విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. బంగార్రాజు సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవుతుందని బల్లగుద్ది చెబుతున్నారు. ఈ సినిమాపై ఈ స్థాయిలో నమ్మకం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

2016లో నాగార్జున హీరోగా విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి ఇది సీక్వెల్. సోగ్గాడే చిన్ని నాయనా మంచి విజయాన్ని నమోదు చేసింది. నాగార్జున కెరీర్ లోనే సోగ్గాడే చిన్నినాయనా హైయెస్ట్ గ్రాసర్ గా ఉంది. మరి కొన్ని గంటల్లో బంగార్రాజు థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios