ఆంజనేయులు, తీన్మార్‌, గబ్బర్‌సింగ్, టెంపర్‌, ఇద్దరమ్మాయిలతో వంటి హిట్‌ చిత్రాల నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు బండ్ల గణేష్.   


కమిడియన్ గా ,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా .. నిర్మాతగా గుర్తింపు సాధించుకున్నారు బండ్ల గణేష్‌. ఇప్పుడాయన్ని హీరోగా పరిచయం చేస్తూ.. కొత్త దర్శకుడు వెంకట్‌ చంద్ర ఓ చిత్రం తెరకెక్కించనున్నారనే సంగతి తెలిసిందే. స్వాతి చంద్ర నిర్మాత. సెప్టెంబరు ఫస్ట్ వీక్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ చిత్రానికి బండ్ల గణేష్ ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నారు..హీరోగా చేస్తున్నారు కాబట్టి తగ్గిస్తున్నారా లేక హీరో కాబట్టి ఎక్కువ డిమాండ్ చేస్తున్నారా?

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నిమిత్తం బండ్ల గణేష్ పాతిక లక్షలు రెమ్యునేషన్ గా తీసుకుంటున్నారట. ఇది ఆర్టిస్ట్ గా ఆయన కేరీర్ లో తీసుకున్న పెద్ద మొత్తం అంటున్నారు. రోజుకు ఇంత అని తీసుకునే బండ్ల గణేష్ ఈ సినిమాకు ఏక మొత్తంగా రెమ్యునేషన్ తీసుకోబోతున్నారు. ఈ మేరకు ఎగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ తీసుకున్నారని వినికిడి. 

దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. బండ్ల గణేష్ అయితేనే హీరో పాత్రకు న్యాయం చేయగలుగుతారని సంప్రదించాం.‌ ఆయన ఓకే చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. తమిళంలో ఆర్. పార్తిబన్ గారు హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ సినిమా 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కి‌ రీమేక్ ఇది. పార్తిబన్ గారికి జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. సినిమాకు పలు పురస్కారాలు దక్కాయి.‌ సెప్టెంబర్ తొలి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తామని చెప్పారు.

తమిళంలో ఘన విజయం సాధించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఒత్త సెరుప్పు అళవు7’(సింగిల్‌ స్లిప్పర్‌ సైజ్-7) లో ఒకే ఒక క్యారెక్టర్‌తో సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు పార్తిబన్‌. ఈ చిత్రానికి అరుణ్ దేవినేని ఛాయాగ్రహకులు. గాంధీ కళా దర్శకులు. 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.