పవన్ కళ్యాణ్ ఓ ప్రక్కన తాను పూర్తి స్దాయి రాజకీయాల్లోనే ఉంటానని, ప్రజల్లోనే ఉంటానని చెప్తున్నా ఆయన సినిమాల్లోకి మళ్లీ వస్తాడంటూ ఊహాగానాలు మాత్రం ఆగటం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీకి నిరాశాజ‌న‌క‌మైన ఫ‌లితాలు వచ్చిన నేపధ్యంలో ... మ‌ళ్లీ ఎల‌క్ష‌న్స్ వరకూ నటిస్తారని అంటున్నారు. 

అభిమానుల కోరిక మేరకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడని చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు గతంలో అడ్వాన్సులు ఇచ్చిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని ఒత్తిడి తెచ్చే అవకాసం ఉందంటున్నారు. ఆయన పొలిటికల్ కెరీర్ కు మైలేజీ ఇచ్చే సినిమాలు చేయమని ప్రపోజల్స్ పెడుతున్నారట. అప్పట్లో ఎన్టీఆర్ చేసిన బొబ్బిలి పులి లాంటి సినిమాలు చేసి ప్రజల్లో చైతన్యం తేవాలని కోరుతున్నారని చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో  ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి  సినీ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినిమా  చేయాల‌ని నిర్మాత,నటుడు బండ్ల గ‌ణేష్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. అందుకోసం ప‌వ‌న్‌కు నలభై కోట్ల రూపాయ‌ల‌ రెమ్యునేష‌న్ కూడా ఆఫ‌ర్ చేశాడ‌ంటున్నారు.  డైరక్టర్ మరెవరో కాదు..మాస్ చిత్రాల‌కు కేరాఫ్ ఎడ్రస్ అనిపించుకున్న బోయపాటి శ్రీను అని టాక్‌. 

అలాగే పవన్ తో సినిమాకు  బోయపాటికి 10 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశాడ‌ట బండ్ల‌. ఈ రెమ్యున‌రేష‌న్స్ కాకుండా సినిమాను 50కోట్ల‌లో పూర్తి చేయాల‌ని కండీషన్ పెట్టారట. అంటే ప్రాజెక్టు దాదాపు వందకోట్లు అని అంటున్నారు. అయితే ఇదంతా నిజమా లేక రూమరా అని తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.