టాలీవుడ్ లో బండ్ల గణేష్, హరీష్ శంకర్ ల మధ్య ట్వీట్ల వివాదం పతాక స్దాయికి చేరింది. ఈ నేపధ్యంలో తాజాగా బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 'తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక... లేని మాటలు అంటకడతారు' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ డైరెక్టర్ హరీష్ శంకర్ ను ఉద్దేశించే చేశారని ప్రచారం జరుగుతోంది. 

వివాదం విషయంలోకి వెళ్తే ,నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమా ఈ మధ్యే 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మన దేశంలోనే సోషల్ మీడియాలో అత్యధిక ట్వీట్స్ చేసిన సినిమాగా ఇది హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమా సాధ్యం కావడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి హృదయ పూర్వక నమస్కారాలు అంటూ హరీష్ శంకర్ లెటర్ రాసాడు. ప్రతీ ఒక్కరి పేరు అందులో ఉంది ఒక్క నిర్మాత బండ్ల గణేష్ పేరు తప్ప. దాంతో ఆ విషయం  సంచలనంగా మారింది.   ఆ తర్వాత బండ్ల గణేశ్ పేరు మర్చిపోయానని మరో ట్వీట్ చేశారు. బ్లాక్ బస్టర్ నిర్మాత అంటూ బండ్లను ప్రశంసించారు. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు.

కానీ, దానికి బండ్ల గణేష్ స్పందిస్తూ.. అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్‌లు మాత్రమే చేయగలడు.. స్ట్రెయిట్ సినిమా తీసి హిట్ కొట్టి చూపించమనండి ఈ ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా.. హరీష్ శంకర్ అనే డైరక్టర్‌కు పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ కల్పించింది నేను.. దాంతో  తన దైన శైలిలో హరీష్ శంకర్  కామెంట్ చేశారు. నా కెరీర్ ని సినీ ఇండస్ట్రీలో మొదలెట్టా..సాఫ్ట్ వేర్ కంపెనీలో కాదు. నా మొదటి సినిమా షాక్ 2006 లో రిలీజ్ అయ్యింది. ఆయన మొదట సినిమా ఆంజనేయులు 2009లో రిలీజ్ అయ్యింది. ఎవరు..ఎవరికి లైఫ్ ఇచ్చారు ? అంటూ మీడియాతో మాట్లాడారు. దానికి  ఇప్పుడు బండ్ల ట్వీట్ లతో చేసిన తాజా వ్యాఖ్యలతో వివాదాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. మరి దీనికి హరీష్ శంకర్ ఏమి కౌంటర్ ఇస్తారో చూడాలి.