కరోనా మహమ్మారి నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ని వదలడం లేదు. వరుసగా ఆయన్ని వెంటాడుతుంది. తాజాగా మరోసారి కరోనా సోకినట్టు బండ్ల గణేష్‌ ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 

నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌(Bandla Ganesh) మూడోసారి కరోనా(Corona) బారిన పడ్డారు. ఆయన సెకండ్‌ వేవ్‌ సమయంలో ఓ సారి వైరస్‌కి గురైన విషయంతెలిసిందే. తాజాగా మరోసారి కరోనా సోకినట్టు Bandla Ganesh ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. `గత మూడు రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు కొద్దిగా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోగా కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. నా కుటుంబ సభ్యులకు నెగిటివ్‌ వచ్చింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేముందు ఒక్కసారి ఆలోచించుకోండి. అందరూ సురక్షితంగా ఉండండి` అంటూ బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్బంగా మెడికల్ రిపోర్ట్ ని ఆయన ట్వీట్టర్‌ ద్వారా పంచుకున్నారు. 

Scroll to load tweet…

ఇప్పటికే గతంలో రెండుసార్లు బండ్ల గణేష్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అనంతరం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా, కరోనా అని తేలిసింది. కరోనా ఫస్ట్ వేవ్‌ సమయంలోనూ ఆయన కరోనా బారిన పడ్డారు. కానీ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆయనకు సీరియస్‌ అయ్యింది. దీంతో అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో చిరంజీవిగారు తనకు సహాయం చేశారని వెల్లడించారు బండ్ల గణేష్‌. ఇప్పుడు మూడోసారి కరోనా సోకడం విచారకరం. 

ఇప్పటికే చాలా మంది తారలు కరోనా బారిన పడ్డారు. తెలుగు, తమిళంలోనూ వరుసగా సెలబ్రిటీలు కరోనాకి గురవుతున్నారు. టాలీవుడ్‌లో మహేష్‌బాబు, రాజేంద్రప్రసాద్‌, మంచు మనోజ్‌ కరోనా బారిన పడ్డారు. అలాగే తమిళనాటు విష్ణు విశాల్‌, త్రిష, అరుణ్‌ విజయ్‌, వడివేలు, మీనా, సత్యరాజ్‌, దర్శకుడు ప్రియదర్శన్‌ కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్‌లో బోనీ కపూర్‌, ఏక్తా కపూర్‌, జాన్‌ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్‌, విశాల్‌ డడ్లానీ,స్వర భాస్కర్‌, మృణాల్‌ ఠాకూర్‌, అర్జున్‌ కపూర్‌, ప్రేమ్‌ చోప్రా వంటి వారు కరోనా సోకిన విషయం తెలిసిందే.