Asianet News TeluguAsianet News Telugu

బండ్ల గణేష్‌ `మా` ఎన్నికల ప్రచారం షురూ.. బంపర్‌ ఆఫర్‌

బండ్ల గణేష్‌(bandla ganesh) స్పందించారు. ఆయన కూడా `మా` ఎన్నికల(maa elections) బరిలో నిల్చున్నారు. జనరల్‌ సెక్రెటరీగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. `మా` ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. వినూత్న ప్రచారానికి తెర తీశారు. 

bandla ganesh start maa election campaign
Author
Hyderabad, First Published Sep 25, 2021, 1:21 PM IST

`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌)(maa) ఎన్నికల వేడి మరింత పెరుగుతుంది. శుక్రవారం `మా` అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు హాట్‌ కామెంట్ చేశారు. తమదే బెస్ట్ టీమ్‌గా చెప్పారు. తాజాగా బండ్ల గణేష్‌(bandla ganesh) స్పందించారు. ఆయన కూడా `మా` ఎన్నికల(maa elections) బరిలో నిల్చున్నారు. జనరల్‌ సెక్రెటరీగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. 

వినూత్న ప్రచారానికి తెర తీశారు. ట్విటర్‌ వేదికగా ఓ పోస్టర్‌ షేర్‌ చేసిన ఆయన `ఒకే ఒక్క ఓటు. మా కోసం. మన కోసం. మనందరి కోసం. మా తరఫున ప్రశ్నించడం కోసం. `ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, జాయింట్‌ సెక్రటరీతోపాటు మిగిలిన ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా మీకు ఇష్టమైన వాళ్లను ఎన్నుకోండి` అని బంపర్‌ ఆఫర్‌ ఇస్తూనే.. కానీ, జనరల్‌ సెక్రటరీగా మాత్రం నన్ను గెలిపించండి` అని అభ్యర్థించారు. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర, యువ నటీనటులను ట్యాగ్‌ చేస్తూ ఆయన ఈ ట్వీట్‌ పెట్టారు.

అక్టోబర్ 10న జరుగనున్న `మా` ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష పీఠం కోసం ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నర్సింహరావు పోటీపడుతున్నారు. ప్రకాష్‌ రాజ్‌ ఇప్పటికే `సినిమా బిడ్డలం` పేరుతో తన ప్యానెల్‌ని ప్రకటించారు. ఇందులో జనరల్‌ సెక్రెటరీగా జీవిత రాజశేఖర్‌ గా పోటీ చేస్తున్నారు. మొదట బండ్ల గణేష్‌ కూడా ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లో ఉన్నారు. జీవితని తీసుకోవడం వల్ల ఆ ప్యానెల్‌ నుంచి తప్పుకుని ఇప్పుడు స్వతంత్రంగా పోటీలో నిల్చున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios